Telangana Movie Ticket Price G.O.: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు, థియేటర్ల వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 77 టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సామాన్య సినీ ప్రేక్షకుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కొత్త నిబంధనలపై పునఃసమీక్ష జరపాలని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అత్యవసరంగా లేఖ రాసింది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది.
జీవో 77లో అసలు ఏముంది? బిజినెస్ సమీకరణాలు ఇవే

ఆగస్టు 14న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 ప్రకారం రాష్ట్రంలోని సినిమా హాళ్లను నాన్-ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లుగా వర్గీకరించారు. ఇందులో 2K/4K ప్రొజెక్షన్, డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ ఉన్న సింగిల్ స్క్రీన్లకు 'స్పెషల్ థియేటర్' కేటగిరీ కింద గరిష్టంగా రూ. 300 వరకు టికెట్ రేటు నిర్ణయించే వెసులుబాటు కల్పించారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మెజారిటీ సింగిల్ స్క్రీన్లు ఈ స్పెషల్ కేటగిరీ కిందకే వస్తాయి. దీనివల్ల మల్టీప్లెక్స్ రేట్లతో సమానంగా సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు పెరిగిపోయి, సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతుందని ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఫిల్మ్ ఛాంబర్ అభ్యంతరం.. సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రమాదంలో..
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శి వి. ఎల్. శ్రీధర్, ప్రెసిడెంట్ జె. చంద్రశేఖర్ రావు ప్రతినిధులుగా వెలువడిన ఈ లేఖలో కీలక విజ్ఞప్తులు చేశారు. చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఛాంబర్ స్పష్టం చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమ భాగస్వాములతో సంప్రదింపులు లేకుండా టికెట్ ధరలు మార్చేస్తే ఆ ప్రభావం థియేటర్ల ఫుట్‌ఫాల్స్‌పై పడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలోని ప్రధాన భాగస్వాములైన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది.
సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేయాలి.. టాలీవుడ్ డిమాండ్
{{/usCountry}}ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమ భాగస్వాములతో సంప్రదింపులు లేకుండా టికెట్ ధరలు మార్చేస్తే ఆ ప్రభావం థియేటర్ల ఫుట్‌ఫాల్స్‌పై పడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలోని ప్రధాన భాగస్వాములైన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది.
సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేయాలి.. టాలీవుడ్ డిమాండ్
{{/usCountry}}తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గుర్తింపు పొందిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లతో ప్రభుత్వం తక్షణమే ఒక సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో అభ్యర్థించారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించే వరకు ఈ అంశాన్ని పునఃసమీక్షలో ఉంచాలని కోరారు.
ఓటీటీల పోటీని తట్టుకుని థియేటర్లకు జనాన్ని రప్పించడం ఇప్పటికే పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు టికెట్ రేట్లు రూ. 300కి చేరితే మధ్యతరగతి కుటుంబాలు థియేటర్లకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల చిన్న, మిడ్ రేంజ్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోతాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రభుత్వం స్పందనపైనే టాలీవుడ్ భవిష్యత్తు
టికెట్ ధరల పెంపు వల్ల వచ్చే లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ల క్షేత్రస్థాయి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫిల్మ్ ఛాంబర్ చేసిన విజ్ఞప్తిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.