...
...
Next Story

తెలంగాణలోనూ పెరిగిన అఖండ 2 టికెట్ల ధరలు.. ప్రీమియర్ షోకూ భారీగానే.. మూడు రోజుల పాటే..

తెలంగాణలోనూ అఖండ 2 టికెట్ల ధరలు పెరిగాయి. ఈమేరకు గురువారం (డిసెంబర్ 4) తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ పెరిగిన ధరలు తొలి మూడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

Published on: Dec 4, 2025, 16:27:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ శుక్రవారం (డిసెంబర్ 5) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టికెట్ల ధరలు ఇప్పటికే ఏపీలో పెరగగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇక్కడా మూవీ టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. తొలి మూడు రోజుల పాటు ఈ పెంచిన ధరలు అమల్లో ఉంటాయని జీవోలో తేల్చి చెప్పారు.

అఖండ 2 టికెట్ల ధరలు ఇలా..

తెలంగాణలోనూ పెరిగిన అఖండ 2 టికెట్ల ధరలు.. ప్రీమియర్ షోకూ భారీగానే.. మూడు రోజుల పాటే..
తెలంగాణలోనూ పెరిగిన అఖండ 2 టికెట్ల ధరలు.. ప్రీమియర్ షోకూ భారీగానే.. మూడు రోజుల పాటే..

తెలంగాణలో అఖండ 2 మూవీ టికెట్ల ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంచుకోవడానికి అనుమతి లభించింది. దీంతో టికెట్ల ధరలు సింగిల్ స్క్రీన్లలో రూ.227కి, మల్టీప్లెక్స్ లలో రూ.395కి చేరాయి.

ఇక ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. ఈ పెంచిన ధరలు తొలి మూడు రోజులు అంటే శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే అమల్లో ఉంటాయి. అంతేకాదు ఈ పెంచిన ధరల్లో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాల్సిందేనన్న నిబంధనతో టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విశేషం.

ఏపీలో టికెట్ల ధరలు ఇలా..

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ అఖండ 2 మూవీ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు గత మంగళవారం (డిసెంబర్ 2) అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిలీజ్ కు ముందు రోజు అంటే గురువారం (డిసెంబర్ 4) రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోల కోసం టికెట్ల ధరను రూ.600 గా నిర్ణయించారు.

అన్ని థియేటర్లలోనూ ఇదే ధర ఉంటుంది. ఇక మూవీ రిలీజయ్యే డిసెంబర్ 5 నుంచి తొలి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ అయితే రూ.75, మల్టీప్లెక్స్ అయితే రూ.100 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ల ధర రూ.222.50 కాగా.. మల్టీప్లెక్స్ లలో రూ.277గా ఉండనుంది.

అఖండ 2 మూవీ గురించి..

ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తికి సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ను జోడించి తీసిన మూవీగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రెండు వేర్వేరు పాత్రల్లో బాలయ్య నటించాడు. తొలిసారి అఘోరా పాత్రలో అతడు నట విశ్వరూపం చూపించినట్లు ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే తెలుస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ 5 నుంచి థియేటర్లలో అభిమానుల పూనకాలు ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks