ఈ నెల మొదట్లో థియేటర్లలో రిలీజైన తెలుగు కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడీ మూవీ నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. డిసెంబర్ లో మొదటి వారంలోనే స్ట్రీమింగ్ కానుంది.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ రిలీజ్ డేట్

వెరైటీ స్టోరీతో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమా డిసెంబర్ 5న డిజిటల్ ప్రీమియర్ కానుంది. జీ5 ఓటీటీలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.
“థియేటర్లలో విజయవంతమైన రన్ తర్వాత ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఎన్నో నవ్వులను మోసుకుంటూ జీ5లోకి వస్తోంది. ఈ ఫన్ ట్రైలర్ తో సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో జీ5 ఓటీటీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. చిన్న సినిమానే అయినా.. ఈమూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ గురించి..
మసూదతో మంచి హిట్ అందుకున్న తిరువీర్ హీరోగా నటించిన మరో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. టీనా శ్రావ్య హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ కథ, దర్శకత్వం వహించాడు.
పెళ్లి ఫొటోలు లేదా ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోలు మిస్ అవ్వడం అనేది నిజ జీవితంలో చాలా చోట్ల జరుగుతుంది. ఈ రియల్ పాయింట్ కు కామెడీ, ఎమోషన్స్ జోడించి తెరకెక్కించిన సినిమానే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సినిమా అంతా పల్లెటూరులో సాగుతుంది. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, ఓ లవ్ ట్రాక్, కామెడీ సీన్స్‌తో అలా వెళ్లిపోతుంటుంది.
ఓ పెళ్లి, వెడ్డింగ్ షూట్ ఆఫర్ రావడం, ప్రీ వెడ్డింగ్ షూట్‌ను హీరో చేసే తీరు, ఆ ఫొటోలు ఉన్న చిప్ పోవడం వంటి సీన్లతో బాగానే సాగుతుంది సినిమా. క్లైమాక్స్‌ను కూడా మంచి కామెడీతో ముగించారు. తిరువీర్ అమాయకంగా, భయపడే పాత్రలో ఒదిగిపోయాడు. టీనా శ్రావ్య క్యూట్‌గా అందంగా అట్రాక్ట్ చేసింది. నరేంద్ర రవి నటన సినిమాకు ప్లస్ అయింది. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో బాగా చేశాడు. ఈ సినిమాతో అతనికి మంచి పేరు వస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ నటన పర్వాలేదు.
{{/usCountry}}ఓ పెళ్లి, వెడ్డింగ్ షూట్ ఆఫర్ రావడం, ప్రీ వెడ్డింగ్ షూట్‌ను హీరో చేసే తీరు, ఆ ఫొటోలు ఉన్న చిప్ పోవడం వంటి సీన్లతో బాగానే సాగుతుంది సినిమా. క్లైమాక్స్‌ను కూడా మంచి కామెడీతో ముగించారు. తిరువీర్ అమాయకంగా, భయపడే పాత్రలో ఒదిగిపోయాడు. టీనా శ్రావ్య క్యూట్‌గా అందంగా అట్రాక్ట్ చేసింది. నరేంద్ర రవి నటన సినిమాకు ప్లస్ అయింది. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో బాగా చేశాడు. ఈ సినిమాతో అతనికి మంచి పేరు వస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ నటన పర్వాలేదు.
{{/usCountry}}