తెలుగు క్రైమ్ కామెడీ మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఫిబ్రవరి 12న నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేద్దాం అనుకున్న ఈ తెలుగు సినిమా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. ప్రముఖ నటుడు శివాజీ, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ మెయిన్ లీడ్స్‌గా నటించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ మార్చి 26న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీ

నిజానికి ఈ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను ఈటీవీ విన్ కోసం ఒక ఓటీటీ ఒరిజినల్ ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేశారు. కానీ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా రావడంతో, మేకర్స్ తమ ప్లాన్ మార్చుకుని మార్చి 6న థియేటర్లలో రిలీజ్ చేశారు.
అక్కడ డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. కరెక్ట్‌గా ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. సుధీర్ శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ ఫన్ అండ్ క్రైమ్ కామెడీలో.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత శివాజీ, లయ జంటగా తెరమీద కనిపించడం అభిమానులకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.
కడుపుబ్బా నవ్వించే క్రైమ్ స్టోరీ..
అసలు ఈ సినిమా కథ ఏంటంటే.. శ్రీరామ్ (శివాజీ) ఒక నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీ. తను భార్య, కొడుకుతో కలిసి చాలా ప్రశాంతంగా జీవితం గడుపుతుంటాడు. అయితే అనుకోకుండా ఒకరోజు వాళ్ల ఇంట్లో విక్రమ్ (ప్రిన్స్) అనే ఒక పోలీస్ ఆఫీసర్ శవమై కనిపిస్తాడు.
అతన్ని తుపాకీతో కాల్చి చంపింది మన కొడుకే అని శ్రీరామ్ భార్య చెబుతుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన శ్రీరామ్, తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఆ హత్య తాలూకు ఆధారాలను చెరిపేయడానికి రంగంలోకి దిగుతాడు. ఆ కంగారులో అతను చేసే పనులు, ఆ తర్వాత జరిగే సంఘటనలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.
శివాజీ, లయ యాక్టింగ్ సూపర్..
దర్శకుడిగా పరిచయమవుతున్న సుధీర్ శ్రీరామ్ ఈ కథను చాలా వినోదాత్మకంగా రాసుకున్నాడు. ముఖ్యంగా నిజాయితీపరుడైన ఆఫీసర్‌గా శివాజీ నటన, అలాగే కొంచెం అమాయకంగా, కాస్త తిక్కగా ప్రవర్తించే భార్య పాత్రలో లయ యాక్టింగ్ థియేటర్లలో ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక ఎప్పుడూ ఫోన్లో రీల్స్ చూస్తూ కాలం గడిపే కొడుకు పాత్రలో రోహన్ నటించాడు.
{{/usCountry}}దర్శకుడిగా పరిచయమవుతున్న సుధీర్ శ్రీరామ్ ఈ కథను చాలా వినోదాత్మకంగా రాసుకున్నాడు. ముఖ్యంగా నిజాయితీపరుడైన ఆఫీసర్‌గా శివాజీ నటన, అలాగే కొంచెం అమాయకంగా, కాస్త తిక్కగా ప్రవర్తించే భార్య పాత్రలో లయ యాక్టింగ్ థియేటర్లలో ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక ఎప్పుడూ ఫోన్లో రీల్స్ చూస్తూ కాలం గడిపే కొడుకు పాత్రలో రోహన్ నటించాడు.
{{/usCountry}}ఇటీవల #90's అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శివాజీ, ఆ తర్వాత కోర్ట్, దండోరా లాంటి ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఈ కామెడీ థ్రిల్లర్‌తో మరోసారి మన ముందుకు వస్తున్నాడు.