ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న డిమాండ్ ఏంటో మనకు తెలుసు. అందుకు తగినట్లే ఈ జానర్లో ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ తెరకెక్కించడానికి ఓటీటీలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఆహా వీడియో కూడా తన ఒరిజినల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్వరలోనే సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానుంది.
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ మూవీ

ఆహా వీడియో ఓటీటీలోకి నేరుగా వస్తున్న సినిమా ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్. ఈ సినిమా తెలుగు, తమిళంలలో రానుంది. ఆహా ఓటీటీ అటు తమిళం, ఇటు తెలుగులలో ఒకేసారి తన ఎక్స్ అకౌంట్ల ద్వారా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను సోమవారం (నవంబర్ 17) రిలీజ్ చేసింది. ఎలాంటి డైలాగులు లేకుండా చాలా ఉత్కంఠగా ఈ టీజర్ సాగిపోయింది.
అశ్విన్, శ్రీతు, గురులాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. జస్విని ఈ మూవీని డైరెక్ట్ చేయగా.. రమణగిరివాసన్ కథ అందించాడు. అశ్వత్ నాగనాథన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ వెల్లడించింది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేయనుంది.
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్, దాని పరిధిలో జరిగే నేరాల చుట్టూ మూవీ తిరగనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ టీజర్ ద్వారా మూవీలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఇది చాలా ఇంటెన్స్‌గా సాగింది. మైథాలజీకి క్రైమ్ ను జోడించిన తీసిన మూవీగా కనిపిస్తోంది. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఆహా వీడియో మూవీస్
ఇక ఆహా వీడియో ఓటీటీలోకి ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీకి ఈ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతకుముందు రాజ్ తరుణ్ నటించిన చిరంజీవి సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ ఓటీటీలోకి 3 రోజెస్ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది.
{{/usCountry}}ఇక ఆహా వీడియో ఓటీటీలోకి ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీకి ఈ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతకుముందు రాజ్ తరుణ్ నటించిన చిరంజీవి సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ ఓటీటీలోకి 3 రోజెస్ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది.
{{/usCountry}}