ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 (ZEE5) మరో ఆసక్తికరమైన తెలుగు వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాజీవ్ కనకాల, యాంకర్ ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'D/o ప్రసాద్ రావు కనబడుటలేదు' (D/o Prasad Rao Kanabadutaledhu). ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఆ విశేషాలు ఏంటో ఇక్కడ చూడండి.
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ ట్రైలర్

ఈ మధ్య సౌత్ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించిన జీ5.. వరుసగా తెలుగు ఒరిజినల్ కంటెంట్ను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'D/o ప్రసాద్ రావు కనబడుటలేదు' అనే ఉత్కంఠభరితమైన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది.
ఈ వెబ్ సిరీస్లో విలక్షణ నటుడు రాజీవ్ కనకాల ప్రసాద్ రావు రోల్ పోషిస్తుండగా, ప్రముఖ యాంకర్ ఉదయభాను ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఆసక్తి నెలకొంది. అలాగే వసంతిక, గాయత్రి భార్గవి, బిందు మౌళి ఇతర కీలక పాత్రల్లో నటించారు.
తాజాగా రిలీజైన ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. స్వాతి నాయుడు అనే అమ్మాయి కనిపించకుండా పోవడం, ఆమె కోసం తండ్రి ప్రసాద్ రావుతోపాటు ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగడం, ఆమె రూమ్మేట్స్, కొలీగ్స్, చివరికి తండ్రిపైనా అనుమానం వ్యక్తం చేస్తూ కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కథేంటంటే..
ఈ వెబ్ సిరీస్ టైటిల్ సూచించినట్లుగానే.. ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) తన కూతురు స్వాతి (వసంతిక) కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతాడు. ఆమె ఆచూకీ కోసం వెతుకుతూ, పోలీసుల సహాయం కోరతాడు. ఈ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ రెబెక్కా జోసెఫ్ (ఉదయభాను) రంగంలోకి దిగుతుంది.
{{/usCountry}}ఈ వెబ్ సిరీస్ టైటిల్ సూచించినట్లుగానే.. ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) తన కూతురు స్వాతి (వసంతిక) కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతాడు. ఆమె ఆచూకీ కోసం వెతుకుతూ, పోలీసుల సహాయం కోరతాడు. ఈ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ రెబెక్కా జోసెఫ్ (ఉదయభాను) రంగంలోకి దిగుతుంది.
{{/usCountry}}విచారణలో భాగంగా స్వాతి అదృశ్యం వెనుక అనేక అబద్ధాలు, వేధింపులు ఉన్నట్లు బయటపడుతుంది. సమయం మించిపోకముందే ప్రసాద్ రావు, రెబెక్కా కలిసి స్వాతిని కాపాడగలిగారా? లేదా? అనేది ఫిబ్రవరి 27న తెలియనుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఒక మంచి ఆప్షన్ కావచ్చు.