రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా 'దేవగుడి' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఆశించిన స్థాయిలో ప్రమోషన్లు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ (Sun NXT) దక్కించుకుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి. మంగళవారం (మార్చి 3) నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.
దేవగుడి స్టోరీ, ఇతర విశేషాలు

బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన దేవగుడి సినిమా పూర్తిగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఒక శక్తివంతమైన ఫ్యాక్షన్ కుటుంబం, వారి ప్రత్యర్థుల మధ్య జరిగే పోరాటమే ఈ మూవీ ప్రధానాంశం.
వీరారెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ధర్మ, ఆ కుటుంబాన్ని శత్రువుల నుండి ఎలా కాపాడాడు? రాఘవ రెడ్డితో ధర్మకు ఉన్న అనుబంధం ఎటువంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథను మలిచారు.
ఈ సినిమాలో అభినవ్ శౌర్య, తోషి అలహరి, అనుశ్రీ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు రఘు కుంచె గురించే. నటుడిగా మారిన అతడు ఈ మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. రఘు కుంచె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ రొటీన్ ఫ్యాక్షన్ డ్రామాకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచాయని విమర్శకులు పేర్కొన్నారు.
కుల వ్యవస్థపై వచ్చిన మూవీ
కుల వ్యవస్థపై ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రధానంగా కులం చుట్టూ తిరిగే కథలో వచ్చే సినిమాల్లో కోర్ పాయింట్ తెలిసేలా ఉంటుంది. అయితే, తెలిసిన విషయాన్ని ఎంత గ్రిప్పింగ్‌గా తెరకెక్కిస్తే ప్రేక్షకుడికి అంత కనెక్ట్ అవుతుంది. ఆ విషయంలో దేవగుడి సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.
సమాజంలో ప్రధాన సమస్యలలో ఒకటైన కుల వ్యవస్థను ప్రశ్నిస్తూనే ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు, తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కుమారుడితో చాలా క్లోజ్ బాండింగ్ ఏర్పరచుకుంటారు. వయసుతో పాటు ఆ బంధం పెరుగుతూ వస్తుంది.
ఓటీటీలో క్లిక్ అవుతుందా?
{{/usCountry}}సమాజంలో ప్రధాన సమస్యలలో ఒకటైన కుల వ్యవస్థను ప్రశ్నిస్తూనే ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు, తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కుమారుడితో చాలా క్లోజ్ బాండింగ్ ఏర్పరచుకుంటారు. వయసుతో పాటు ఆ బంధం పెరుగుతూ వస్తుంది.
ఓటీటీలో క్లిక్ అవుతుందా?
{{/usCountry}}ఇటీవల 'శ్రీ చిదంబరం గారు' వంటి చిన్న సినిమాలు థియేటర్లలో కనుమరుగైనప్పటికీ, ఓటీటీలోకి వచ్చాక మంచి వ్యూస్‌ను సాధించాయి. గ్రామీణ నేపథ్యం, యాక్షన్, సెంటిమెంట్ కలగలిసిన 'దేవగుడి' కూడా డిజిటల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మార్చి 3 నుంచి సన్ నెక్స్ట్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.