లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ 'ఈషా' (Eesha) ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ అది కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే. కానీ ఇప్పుడు ఇండియాలోనూ డిజిటల్ ప్రీమియర్ కానుంది. శుక్రవారం (ఫిబ్రవరి 20) నుంచి ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఆ విశేషాలు ఇక్కడ చూడండి.
విదేశాల్లో ముందే స్ట్రీమింగ్..

హెబ్బా పటేల్ (Hebah Patel) ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'ఈషా' థియేట్రికల్ రిలీజ్‌కు ముందు మంచి ప్రమోషన్స్‌తో బజ్ క్రియేట్ చేసింది. గతేడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రైమ్ వీడియో.. బుధవారం అంటే ఫిబ్రవరి 18 నుంచే ఇండియా బయట ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది. అయితే ఇండియాలో స్ట్రీమింగ్ కాకపోవడంతో ఇక్కడి ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అసలు ఈ సినిమా ఇక్కడ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది..
ఆ నిరీక్షణకు తెరదించుతూ మూవీ టీమ్ తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ద్వారా స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఈషా' సినిమా ఫిబ్రవరి 20 నుంచి ప్రైమ్ వీడియో ఇండియాలో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా తెలుగులో సినిమాలకు నాలుగు వారాల ఓటీటీ విండో ఉంటుంది.
కానీ ఈ సినిమాకు దాదాపు ఎనిమిది వారాల గ్యాప్ రావడం అరుదైన విషయం. ప్రస్తుతానికి కేవలం తెలుగు వెర్షన్ గురించి మాత్రమే సమాచారం ఉంది. ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్ల గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఈషా మూవీ స్టోరీ, విశేషాలు
{{/usCountry}}కానీ ఈ సినిమాకు దాదాపు ఎనిమిది వారాల గ్యాప్ రావడం అరుదైన విషయం. ప్రస్తుతానికి కేవలం తెలుగు వెర్షన్ గురించి మాత్రమే సమాచారం ఉంది. ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్ల గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఈషా మూవీ స్టోరీ, విశేషాలు
{{/usCountry}}నలుగురు స్నేహితులు ఒక దొంగ బాబాను ఎదిరించడానికి, దెయ్యాలు లేవని నిరూపించడానికి ఒక పాడుబడిన ఇంట్లో మూడు రోజులు గడపడానికి వెళ్తారు. ఆ ఇంట్లో వాళ్లకు ఎలాంటి భయానక అనుభవాలు ఎదురయ్యాయి? అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌తో పాటు ఆదిత్ అరుణ్, అఖిల్ రాజ్, సిరి హనుమంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు.