...
...
Next Story

OTT Horror Thriller: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీ.. సడెన్‌గా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే?

OTT Horror Thriller: ఓటీటీలో లేటెస్ట్ తెలుగు మిస్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన అగధ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను జీ5 ఓటీటీ సడెన్ గా అనౌన్స్ చేసింది.

Published on: Sep 19, 2026, 10:52:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Horror Thriller: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎంఎస్ రాజు తెరకెక్కించిన డివైన్ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ 'అగధ' (Agadha) ఓటీటీ ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో ఆగస్టు 14న విడుదలై ఆకట్టుకున్న ఈ సూపర్ నేచురల్ హారర్ డ్రామా, సెప్టెంబర్ 25 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.

ఎంఎస్ రాజు మార్క్ డివైన్ థ్రిల్లర్

OTT Horror Thriller: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీ.. సడెన్‌గా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే?
OTT Horror Thriller: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీ.. సడెన్‌గా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే?

ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు.. గత కొంతకాలంగా దర్శకత్వంలోనూ తన ప్రత్యేక శైలిని చాటుకుంటున్నారు. 'డర్టీ హరి' వంటి డిఫరెంట్ ఎంటర్‌టైనర్ తర్వాత ఆయన కాన్సెప్ట్ ఓరియంటెడ్ జోనర్ ఎంచుకుని 'అగధ' చిత్రాన్ని రూపొందించారు.

"మంచికి చెడుకి మధ్య జరిగే ఒక భయంకరమైన యుద్ధమే ఈ అగధ" అంటూ జీ5 టీమ్ సోషల్ మీడియాలో పోస్టర్ షేర్ చేస్తూ అధికారికంగా అనౌన్స్ చేసింది. దైవిక శక్తులు, ప్రతికూల శక్తుల నడుమ సాగే పోరాటాన్ని ఎంఎస్ రాజు స్క్రీన్ పై చాలా ఇంటెన్స్‌గా ఆవిష్కరించారు.

అగధ మూవీ స్టోరీ ఇలా..

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మహాదేవి (కామాక్షి భాస్కర్ల) కి అసాధారణమైన దైవిక శక్తులు ప్రాప్తిస్తాయి. గ్రామంలో ప్రజల కష్టాలను తీర్చే ఆమె, తన బాబాయ్ (భానుచందర్) కూతురు మహిమ (ఉల్కా గుప్తా) నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అనుమానాస్పద రీతిలో సూసైడ్ చేసుకోవడంతో సొంత ఊరికి తిరిగి వస్తుంది.

ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ కామాక్షి భాస్కర్ల మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. దైవిక శక్తులు ఉన్న మహాదేవి పాత్రలో ఆమె గంభీరమైన ఆహార్యం, కళ్లతో పలికించిన ఎమోషన్స్ థియేటర్లో ఆడియెన్స్ ను కట్టిపడేస్తాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రవణ్ రెడ్డి నటన మెప్పిస్తుంది.

తొలి సినిమా అయినా కూడా జోవికా విజయ్ కుమార్ దెయ్యం పట్టిన సీన్లలో భయపెట్టి సర్ ప్రైజ్ చేసింది. సీనియర్ నటులు భానుచందర్, వనితా విజయ్ కుమార్ తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. రాకేష్ వెంకటాపురం అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. 'కాంతార' శైలి ఫోక్ టచ్ ఉన్న బీజీఎమ్స్ హారర్ మూడ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. నాని చమిడిశెట్టి కెమెరా వర్క్, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్షన్ డార్క్ అట్మాస్ఫియర్ ను అద్భుతంగా ఆవిష్కరించాయి.

అయితే ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన మిస్టరీ అండ్ థ్రిల్ ని సెకండాఫ్ లో కంటిన్యూ చేయడంలో రైటింగ్ కాస్త తడబడింది. 'తుంబాడ్' శైలిలో పురాతన క్షుద్రపూజలు, దేవుడు-దెయ్యం కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ థియేటర్లలో కావాల్సినంత భయం పుట్టించలేకపోయారు. కథనం రొటీన్ గా మారిపోవడం, క్లైమాక్స్ హడావుడిగా ముగిసిపోవడం ఆడియెన్స్ ను కాస్త డిజప్పాయింట్ చేస్తుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ ఓటీటీ ఛాయిస్

ఇటీవలి కాలంలో తెలుగు ఓటీటీ స్పేస్‌లో డివైన్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఎంఎస్ రాజు విజన్, టేకింగ్ ఈ సినిమాను డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాయి.

థియేటర్లలో మిస్ అయిన హారర్, సస్పెన్స్ లవర్స్ ఈ సెప్టెంబర్ 25 నుంచి జీ5లో 'అగధ' సినిమాను హ్యాపీగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks