ఈ ఏడాది రిలీజైన తెలుగు సినిమాల్లో అతి పెద్ద హిట్ సాధించిన చిన్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ.22 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ 623 శాతం లాభాలతో దుమ్ము రేపింది. విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీ రిలీజ్ డేట్

రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈటీవీ విన్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. గురువారమే (డిసెంబర్ 18) మూవీ ప్రీమియర్ ఉంటుందని ఆ ఓటీటీ వెల్లడించింది. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ చిన్న సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ థియేటర్ల కంటే ఎక్కువ రన్‌టైమ్ తో రానుండటం కూడా మరో విశేషం. బిగ్గెస్ట్ లవ్ స్టోరీ మీ ఇళ్లకు వస్తోందనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఈ మూవీ కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది.
రాజు వెడ్స్ రాంబాయి మూవీ గురించి..
రాజు వెడ్స్ రాంబాయి సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. క్రమంగా కలెక్షన్లు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘రాంబాయి నీ మీద నాకు మనసాయెనే’ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా ఈ పాట వినిపిస్తూనే ఉంది. ఈ సాంగ్ తో సినిమాపై ఇంట్రెస్ట్ మరింత ఎక్కువైంది.
రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు సాయిలు కంభంపాటి డైరెక్టర్. ఇందులో అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి తదితరులు నటించారు.
రాజు వెడ్స్ రాంబాయి స్టోరీ
ఖమ్మం, వరంగల్ సరిహద్దులో ఉన్న ఓ గ్రామంలో ప్రేమను గెలిపించుకోవడానికి లవర్స్ ఏం చేశారు? ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా మూవీ తీయడం విశేషం. రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొడుతుంటాడు. గ్రామంలో పెళ్లయినా, చావైనా రాజ్ బ్యాండ్ మోగాల్సిందే. అదే ఊరికి చెందిన రాంబాయి (తేజస్విని రావ్)ని రాజు ప్రేమిస్తాడు.
{{/usCountry}}ఖమ్మం, వరంగల్ సరిహద్దులో ఉన్న ఓ గ్రామంలో ప్రేమను గెలిపించుకోవడానికి లవర్స్ ఏం చేశారు? ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా మూవీ తీయడం విశేషం. రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొడుతుంటాడు. గ్రామంలో పెళ్లయినా, చావైనా రాజ్ బ్యాండ్ మోగాల్సిందే. అదే ఊరికి చెందిన రాంబాయి (తేజస్విని రావ్)ని రాజు ప్రేమిస్తాడు.
{{/usCountry}}రాంబాయి కూడా రాజును ఇష్టపడుతుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) మాత్రం తన కూతురి పెళ్లి గవర్నమెంట్ జాబ్ ఉన్నోడితోనే చేయించాలనుకుంటాడు. దీంతో రాంబాయిని పెళ్లి చేసుకోవాలనే రాజు.. ముందే ప్రెగ్నెంట్ చేస్తే చచ్చినట్లు పెళ్లి చేస్తారనుకుంటాడు. రాంబాయి ప్రెగ్నెంట్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వెంకన్న ఏం చేశాడు? రాజు, రాంబాయిల పెళ్లి జరిగిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే.