...
...
Next Story

OTT Romantic: ఓటీటీలోకి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ.. కళ్లతో మాట్లాడే హీరోయిన్.. చరిత్ర గుర్తు పెట్టుకునేంత ప్రేమ కథ కాదు

OTT Romantic: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ మూవీ బాలు గీత స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేయగా.. అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. టీజర్ ఎలా ఉంది? ఆ మూవీ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

Published on: Sep 21, 2026, 13:40:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Romantic: ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) రూపొందించిన సరికొత్త ఒరిజినల్ మూవీ 'బాలు గీత' (Balu Geetha) నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఇదో క్యూట్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. కళ్లతోనే మాట్లాడుతూ హీరోయిన్ ఆకట్టుకోగా.. తమది చరిత్ర గుర్తు పెట్టుకునేంత పెద్ద లవ్ స్టోరీ ఏమీ కాదంటూ హీరో తమ కథ గురించి చెప్పడం విశేషం. సందీప్ సరోజ్, కేయూరి లీడ్ పెయిర్‌గా తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా టీజర్ డిజిటల్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ప్రేమ, జీవితం, సెకండ్ ఛాన్స్.. ఆకట్టుకుంటున్న టీజర్ కాన్సెప్ట్

OTT Romantic: ఓటీటీలోకి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ.. కళ్లతో మాట్లాడే హీరోయిన్.. చరిత్ర గుర్తు పెట్టుకునేంత ప్రేమ కథ కాదు
OTT Romantic: ఓటీటీలోకి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ.. కళ్లతో మాట్లాడే హీరోయిన్.. చరిత్ర గుర్తు పెట్టుకునేంత ప్రేమ కథ కాదు

"చెప్పని కథలు, మరువలేని జ్ఞాపకాలు, రెండో ఛాన్స్.. ప్రేమ, జీవితం చుట్టూ సాగే ఒక చిన్న అందమైన ప్రయాణమే ఈ సినిమా" అంటూ ఈటీవీ విన్ టీమ్ ఒక హార్ట్ టచింగ్ క్యాప్షన్‌ను టీజర్‌కు జోడించింది. టీజర్‌లో హీరో బాలు, హీరోయిన్ గీత మధ్య సాగే ప్యూర్ అండ్ నేచురల్ సీన్లు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.

గతంలో పడ్డ మానసిక గాయాలు, విడిపోయిన రెండు మనసులు మళ్లీ ఎలా కలిశాయి? ఒక రెండో అవకాశం వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పింది? అనే యూనిక్ పాయింట్‌తో దర్శకుడు ప్రతాప్ కొల్లా రెడ్డి (హరా) ఈ డ్రామాను డిజైన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ అందించిన మైల్డ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రేహన్ సినిమాటోగ్రఫీ లైవ్లీ విజువల్స్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ముఖ్యంగా హీరోయిన్ కేయూరి అందం, కళ్లతోనే ఆమె పలికించిన ఎమోషన్స్ చాలా బాగున్నాయి. చరిత్ర గుర్తు పెట్టుకునేంత పెద్ద లవ్ స్టోరీ కాకపోయినా విని వదిలేసేంత చిన్నదేమీ కాదంటూ మీరో సందీప్ సరోజ్ చెప్పే డైలాగ్ కూడా బాగుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్రాండింగ్..

ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్ గతంలో '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' వంటి క్లీన్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కంటెంట్‌తో ఓటీటీ స్పేస్‌లో సంచలనం సృష్టించింది. అదే బాటలో 'బాలు గీత' కూడా ప్రతి ఒక్కరి హృదయాలను తాకే ఒక బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ మూవీగా నిలవబోతోందని టీజర్ విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి.

సందీప్ సరోజ్, కేయూరి కెమిస్ట్రీ.. కంబ్యాక్ ఇస్తున్న కృష్ణుడు

యంగ్ యాక్టర్ సందీప్ సరోజ్ 'బాలు' క్యారెక్టర్‌లో ఎంతో సహజమైన నటన కనబరిచారు. ఆయన లుక్స్, డైలాగ్ డెలివరీ మిడిల్ క్లాస్ యంగ్‌స్టర్స్ అనుభవించే రియల్ లైఫ్ ఎమోషన్స్‌కు చాలా దగ్గరగా ఉన్నాయి. హీరోయిన్ కేయూరి 'గీత' పాత్రలో చాలా హోమ్లీగా, క్యూట్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది.

చాలా కాలం విరామం తర్వాత వర్సటైల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కృష్ణుడు ఈ మూవీతో డిజిటల్ స్పాట్‌లైట్‌లోకి సాలిడ్ కంబ్యాక్ ఇస్తున్నారు. ఆయన పాత్ర కథలో నవ్వులు పూయించడంతో పాటు ముఖ్యమైన ట్విస్టులు తిప్పుతుందని చిత్రయూనిట్ వెల్లడించింది.

అక్టోబర్ 15 నుంచి ఈటీవీ విన్ లో ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్

ఇటీవలి కాలంలో రొటీన్ యాక్షన్ డ్రామాలు, డార్క్ క్రైమ్ థ్రిల్లర్ల నుంచి కాస్త రిలీఫ్ కోరుకుంటున్న తెలుగు ఓటీటీ ఆడియన్స్‌కు 'బాలు గీత' పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. మైండ్ రిలాక్స్ చేసే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

దసరా పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అక్టోబర్ 15 నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈటీవీ విన్ లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. పండుగ రోజుల్లో ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసేలా ఒక ప్యూర్ క్లీన్ ఎంటర్‌టైనర్ సిద్ధమైపోయిందని ఈటీవీ విన్ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks