టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 370కి పైగా సినిమాలు చేసిన నటుడి మృతి.. నెల కిందటే కుమారుడి మరణం
టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. 370కు పైగా సినిమాలు చేసిన తెలుగు సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూశారు. నెలల కిందటే ఆయన కుమారుడు మరణిించారు. అదే బెంగతో రఘునాథ్ రెడ్డికి గుండెపోటు వచ్చినట్లు తెలిసింది.
సీనియర్ నటుడు రాఘునాథ్ రెడ్డి మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. 370కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తుదిశ్వాస విడిచారు. గుండె పోటుతో మరణించారు. నెల క్రితమే ఆయన కుమారుడు కన్నుమూశారు. ఆ బెంగతోనే కుమిలిపోతున్న రఘునాథ్ రెడ్డి ఈ రోజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

రఘనాథ్ రెడ్డి మరణం
ఎన్నో సినిమాల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు రఘునాథ్ రెడ్డి. సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. విలన్ గానూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. సీరియల్స్ లోనూ నటుడిగా తనదైన ముద్ర వేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, భోజ్ పురి భాషల సినిమాల్లోనూ ఆయన నటించారు. అలాంటి సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి సడెన్ గా మరణించడంతో టాలీవుడ్ షాక్ అవుతోంది.
శోభన్ బాబు సినిమాతో
శోభన్ బాబు హీరోగా నటించిన సర్పయాగం సినిమాతో నటుడిగా రఘునాథ్ రెడ్డి అడుగు పడింది. ఈ చిత్రానికి పరిచూరి బ్రదర్స్ డైరెక్టర్స్. ఇది 1991లో రిలీజైంది. ఆ తర్వాత రఘునాథ్ రెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ సాగిపోయారు.
శీను, పెళ్లి పందిరి, స్వయంవరం, రాజకుమారుడు, దేవిపుత్రుడు, కలెక్టర్ గారు, ఒసేయ్ రాములమ్మ, కలిసుందాం రా, ఒరేయ్ రిక్షా, ఇంద్ర, డాన్, తమ్ముడు, మల్లీశ్వరి, శ్రీరామ రాజ్యం లాంటి అనేక సినిమాల్లో నటించారు రఘునాథ్ రెడ్డి. నాన్న, గోమాత లాంటి సీరియల్స్ లో కనిపించారు.
తండ్రి క్యారెక్టర్లు
రఘునాథ్ రెడ్డి టాలీవుడ్ లో తండ్రి క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. హీరోలకు, హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఇక విలన్ గానూ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఆయన చివరగా 2018లో వచ్చిన సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలో కనిపించారు. అనారోగ్యం కారణంగా అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.
కన్న కొడుకు
రఘునాథ్ రెడ్డి కుమారుడు నెల రోజుల క్రితం మరణించారు. అప్పటి నుంచి కొడుకునే తలుచుకుంటూ రఘునాథ్ రెడ్డి కుమిలిపోయారు. ఇప్పుడు అదే ఆవేదనతో గుండెపోటు వచ్చి మరణించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఉన్న తన సొంత ఇంట్లో రఘునాథ్ రెడ్డి కన్నుమూసినట్లు సమాచారం.
ప్రస్తుతం కుషాయిగూడలో రఘునాథ రెడ్డి పార్థివ దేహం ఉంది. సినిమా, సీరియల్ నటులు వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. రఘునాథ రెడ్డి మరణం టాలీవుడ్ కు తీరని లోటు అని తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


