...
...
Next Story

The Red Bag Movie: ఊహకందని ట్విస్టులు.. టీజర్‌లో 10 శాతమే చూశారు: తెలుగు థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్ మూవీ నిర్మాత హరికృష్ణ

The Red Bag Movie: తెలుగులో మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ది రెడ్ బ్యాగ్ థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీ కంటెంట్ పై నిర్మాత హరికృష్ణ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ.. ఈ సినిమాలో ట్విస్టులు ఎవరి ఊహకూ అందనట్లుగా ఉంటాయని చెప్పారు.

Published on: Aug 18, 2026, 19:07:34 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

The Red Bag Movie: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ భారీ స్థాయిలో ప్రెజెంట్ చేస్తోన్న మైండ్ బ్లాకింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'ది రెడ్ బ్యాగ్' ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ లభించింది.

యూట్యూబ్‌లో ట్రెండింగ్ టీజర్.. ప్రొడ్యూసర్ హరికృష్ణ ఫుల్ కాన్ఫిడెన్స్

The Red Bag Movie: ఊహకందని ట్విస్టులు.. టీజర్‌లో 10 శాతమే చూశారు: తెలుగు థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్ మూవీ నిర్మాత హరికృష్ణ
The Red Bag Movie: ఊహకందని ట్విస్టులు.. టీజర్‌లో 10 శాతమే చూశారు: తెలుగు థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్ మూవీ నిర్మాత హరికృష్ణ

రవికుమార్ సీరపు డైరెక్షన్ లో తెరకెక్కిన 'ది రెడ్ బ్యాగ్' సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్ నెలకొంది. మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి ఆడియన్స్ అంచనాలను పెంచేశాయి.

సినిమా థియేట్రికల్ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్ హరికృష్ణ సోమిశెట్టి మీడియాతో మాట్లాడి తన కాన్ఫిడెన్స్‌ను షేర్ చేసుకున్నారు. టీజర్ చూసి ఆడియన్స్ ఎంత ఎగ్జైట్ అయ్యారో, దానికి పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ థియేటర్లలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

"మా ‘రెడ్ బ్యాగ్’ చిత్రానికి మంచి హైప్ ఏర్పడింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్‌కి మంచి ఆదరణ దక్కింది. గ్లింప్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. మా కంటెంట్‌కి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కాయి. మా సినిమా చాలా స్టైలీష్‌గా ఉందని, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని అంతా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు చూసిన కంటెంట్ కంటే సినిమా పది రెట్లు ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుంది. ఈ చిత్రంలోని ట్విస్ట్‌ల్ని ఎవ్వరూ గెస్ చేయలేరు" అని అన్నారు.

సినిమాలో ఉన్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, స్టైలిష్ టేకింగ్ మాస్, క్లాస్ ఆడియన్స్‌ను ఒకేలా మెప్పిస్తాయని మేకర్స్ చెప్తున్నారు. కథలో వచ్చే ప్రతీ మలుపు చాలా నేచురల్‌గా ఉంటూనే, ఆడియన్స్ అంచనాలను తలకిందులు చేసేలా స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు.

ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవిలతో పాటు సీనియర్ యాక్ట్రెస్ రాశి కీలక పాత్రల్లో నటించారు. యంగ్ కంపోజర్లు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఈ థ్రిల్లర్ మూవీకి మెయిన్ హైలైట్‌గా నిలవనున్నాయి.

పీవీఆర్ ఐనాక్స్ బిగ్ సపోర్ట్.. భారీగా థియేటర్లు

ప్రస్తుతం కంటెంట్ ఆధారంగా వచ్చే చిన్న సినిమాలకు సరైన థియేటర్లు దొరకడం పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అయితే 'ది రెడ్ బ్యాగ్' సబ్జెక్ట్ నచ్చడంతో నేషనల్ డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చింది.

వారి సపోర్ట్‌తో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో స్ట్రీన్లు లభిస్తుండటం విశేషం. సస్పెన్స్, థ్రిల్, యాక్షన్ ఎలిమెంట్స్ నచ్చే ప్రతి ఒక్కరికీ 'ది రెడ్ బ్యాగ్' ఒక పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని, బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా పెద్ద సక్సెస్ సాధిస్తుందని ప్రొడ్యూసర్ హరికృష్ణ నమ్మకంగా ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks