తెలుగు టీవీ సీరియల్స్ 52వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎప్పటిలాగే కార్తీక దీపం 2 సీరియల్ హవా కొనసాగింది. మొత్తంగా టాప్ 10లో ఏడు స్టార్ మా, మూడు జీ తెలుగు సీరియల్స్ చోటు సంపాదించాయి. స్టార్ మాలో వచ్చిన కొత్త సీరియల్ పొదరిల్లు.. వరుసగా మూడో వారం కూడా టాప్ 10లోనే నిలవడం విశేషం.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

2025 మొత్తం తెలుగులో స్టార్ మా సీరియల్స్ హవానే కొనసాగిన విషయం తెలుసు కదా. చివరి వారం కూడా అదే జరిగింది. టాప్ 10లో ఏడు ఈ ఛానెల్ కు చెందిన సీరియల్సే ఉన్నాయి. వీటిలోనూ కార్తీక దీపం 2 సీరియల్ 14.94 రేటింగ్ తో తొలి స్థానంతో ఏడాదిని ముగించింది. 2025లో మధ్యలో కొన్ని వారాలు తప్ప ఏడాది మొత్తంగా ఈ సీరియలే టాప్ లో ఉంటూ వచ్చింది. కొన్నాళ్లు ఇల్లు ఇల్లాలు పిల్లలు టాప్ లోకి దూసుకెళ్లినా.. మళ్లీ కార్తీక దీపం 2 తన స్థానాన్ని అందుకుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు రెండో స్థానానికే పరిమితమైంది. తాజాగా ఆ సీరియల్ కు 14.20 రేటింగ్ వచ్చింది. మూడో స్థానంలో గుండె నిండా గుడి గంటలు ఉంది. దీనికి 12.11 రేటింగ్ రాగా.. నాలుగో స్థానంలో ఉన్న ఇంటింటి రామాయణం 11.91 రేటింగ్ తో నిలిచింది.
చిన్ని ఐదో స్థానంలోనే కొనసాగింది. అయితే చివరి వారం రేటింగ్ చాలా మెరుగైంది. 52వ వారం చూసుకుంటే 11.49 రేటింగ్ రావడం విశేషం. ఆరో స్థానంలో నిండు మనసులు ఉంది. దీనికి 9.45 రేటింగ్ వచ్చింది. పొదరిల్లు (7.99) 8వ స్థానానికి పడిపోయింది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే చామంతి సీరియల్ టాప్ లో ఉంది. దీనికి 52వ వారం 8.27 రేటింగ్ నమోదైంది. ఓవరాల్ గా టాప్ 10లో చూస్తే ఏడో స్థానంలో నిలిచింది. ఇక మేఘ సందేశం (7.72), జయం (7.58) తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే టాప్ 10లో మూడు జీ తెలుగు సీరియల్స్ చోటు సంపాదించాయి. కింద టేబుల్లో టాప్ 10 సీరియల్స్ వివరాలు చూడొచ్చు.
{{/usCountry}}జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే చామంతి సీరియల్ టాప్ లో ఉంది. దీనికి 52వ వారం 8.27 రేటింగ్ నమోదైంది. ఓవరాల్ గా టాప్ 10లో చూస్తే ఏడో స్థానంలో నిలిచింది. ఇక మేఘ సందేశం (7.72), జయం (7.58) తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే టాప్ 10లో మూడు జీ తెలుగు సీరియల్స్ చోటు సంపాదించాయి. కింద టేబుల్లో టాప్ 10 సీరియల్స్ వివరాలు చూడొచ్చు.
{{/usCountry}}| సీరియల్ పేరు | ఛానెల్ | టీఆర్పీ రేటింగ్ |
|---|---|---|
| కార్తీక దీపం 2 | స్టార్ మా | 14.94 |
| ఇల్లు ఇల్లాలు పిల్లలు | స్టార్ మా | 14.20 |
| గుండె నిండా గుడి గంటలు | స్టార్ మా | 12.11 |
| ఇంటింటి రామాయణం | స్టార్ మా | 11.91 |
| చిన్ని | స్టార్ మా | 11.49 |
| నిండు మనసులు | స్టార్ మా | 9.45 |
| చామంతి | జీ తెలుగు | 8.27 |
| పొదరిల్లు | స్టార్ మా | 7.99 |
| మేఘ సందేశం | జీ తెలుగు | 7.72 |
| జయం | జీ తెలుగు | 7.58 |