స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ కు సంబంధించి తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. మరోసారి కార్తీక దీపం 2 సీరియల్ టాప్ లోనే ఉండగా.. టాప్ 10లో మొత్తంగా ఏడు స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. జీ తెలుగు సీరియల్స్ చివరి మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

కొన్నేళ్లుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న స్టార్ మా సీరియల్స్.. 2025లోనూ అదే హవా కొనసాగించాయి. 51వ వారం కూడా టాప్ 7లో అన్నీ ఆ ఛానెల్ సీరియల్సే ఉన్నాయి. తొలి స్థానంలో ఉన్న కార్తీక దీపం 2 సీరియల్ కు 14.25 రేటింగ్ వచ్చింది. ఓవరాల్ గా ఈ సీరియల్ తొలి స్థానంలో ఉన్నా.. కేవలం అర్బన్ రేటింగ్ చూసుకుంటే మాత్రం 11.16తో గుండె నిండా గుడి గంటలు తొలి స్థానంలో ఉంది. ఓవరాల్ గా 12.37తో ఇది మూడో స్థానంలో ఉంది.
రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు 13.62 రేటింగ్ నమోదైంది. ఇంటింటి రామాయణం (12.28), చిన్ని (10.68), నిండు మనసులు (9.48), పొదరిల్లు (8.44) ఉన్నాయి. మూడు వారాల కిందటే మొదలైన కొత్త సీరియల్ పొదరిల్లు టాప్ 10లోనూ కొనసాగుతూ వస్తుండటం విశేషం.
జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ ఇలా..
ఇక జీ తెలుగు విషయానికి వస్తే.. టాప్ 10లో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ ఛానెల్లో వచ్చే మేఘ సందేశం సీరియల్ 8.22 రేటింగ్ తో ఎనిమిదో స్థానంలో ఉంది. మరో సీరియల్ చామంతి 7.89తో 9వ స్థానంలో, జయం సీరియల్ 7.73తో పదో స్థానంలో ఉన్నాయి.
లక్ష్మీ నివాసం (7.58), జగద్ధాత్రి (7.43) సీరియల్స్ టాప్ 10లో చోటు కోల్పోయాయి. ఈ ఛానెల్లో సీరియల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంటోంది. ప్రతి వారం చివరి మూడు స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టాప్ 10లో ఉండటానికి జీ తెలుగులోని ఐదు సీరియల్స్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
{{/usCountry}}లక్ష్మీ నివాసం (7.58), జగద్ధాత్రి (7.43) సీరియల్స్ టాప్ 10లో చోటు కోల్పోయాయి. ఈ ఛానెల్లో సీరియల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంటోంది. ప్రతి వారం చివరి మూడు స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టాప్ 10లో ఉండటానికి జీ తెలుగులోని ఐదు సీరియల్స్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
{{/usCountry}}