స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ కు సంబంధించి ఈ ఏడాది 46వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. తొలి స్థానంలో కార్తీకదీపం 2 సీరియల్ కొనసాగుతుండగా.. కేవలం అర్బన్ మార్కెట్ రేటింగ్ చూస్తే మాత్రం గుండె నిండా గుడి గంటలు టాప్ లో ఉండటం విశేషం. మరి టాప్ 10లో ఏ సీరియల్ ఎంత రేటింగ్ సాధించిందో చూద్దాం.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

తెలుగు టీవీ సీరియల్స్ విషయానికి వస్తే స్టార్ మా ఛానెల్ ఆధిపత్యం కొనసాగింది. అందులోనూ కార్తీక దీపం 2 సీరియల్ దూకుడు కొనసాగుతోంది. వరుసగా రెండో వారం కూడా ఆ సీరియల్ రేటింగ్ 16 దాటడం విశేషం. 46వ వారం ఈ సీరియల్ రేటింగ్ 16.23గా నమోదైంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా 15.05 రేటింగ్ సాధించింది.
అర్బన్ మార్కెట్ లో 12.35 రేటింగ్ తో తొలి స్థానంలో ఉన్న గుండె నిండా గుడి గంటలు సీరియల్.. ఓవరాల్ గా ఈ వారం మరోసారి మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఈ సీరియల్ కు 13.80 రేటింగ్ నమోదైంది. నాలుగో స్థానంలో ఉన్న ఇంటింటి రామాయణం 13.79తో తృటిలో మూడో స్థానం కోల్పోయింది.
ఇక ఐదో స్థానంలో చిన్ని సీరియల్ కొనసాగుతోంది. దీనికి తాజాగా 11.96 రేటింగ్ వచ్చింది. ఆరో స్థానంలో నిండు మనసులు సీరియల్ ఉంది. దీనికి 46వ వారం 8.94 రేటింగ్ నమోదైంది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక జీ తెలుగు విషయానికి వస్తే ఈ ఛానెల్ సీరియల్స్ రేటింగ్స్ ఎంతో మెరుగయ్యాయి. టాప్ 10లో ఉన్న నాలుగు సీరియల్స్ కూడా 8 కంటే ఎక్కువ రేటింగ్ నమోదు చేయడం విశేషం. ఏడో స్థానంలో ఉన్న చామంతికి 8.53 రేటింగ్ వచ్చింది. ఇక 8వ స్థానంలో ఉన్న మేఘసందేశం 8.41తో, 9వ స్థానంలో ఉన్న జయం 8.39తో, 10 వస్థానంలో ఉన్న జగద్ధాత్రి 8.15 రేటింగ్ తో ఉన్నాయి. చాలా రోజుల తర్వాత జీ తెలుగుకు చెందిన నాలుగు సీరియల్స్ టాప్ 10లో ఉండటమే కాదు.. అన్నీ 8కి పైగా రేటింగ్ సాధించాయి.
{{/usCountry}}ఇక జీ తెలుగు విషయానికి వస్తే ఈ ఛానెల్ సీరియల్స్ రేటింగ్స్ ఎంతో మెరుగయ్యాయి. టాప్ 10లో ఉన్న నాలుగు సీరియల్స్ కూడా 8 కంటే ఎక్కువ రేటింగ్ నమోదు చేయడం విశేషం. ఏడో స్థానంలో ఉన్న చామంతికి 8.53 రేటింగ్ వచ్చింది. ఇక 8వ స్థానంలో ఉన్న మేఘసందేశం 8.41తో, 9వ స్థానంలో ఉన్న జయం 8.39తో, 10 వస్థానంలో ఉన్న జగద్ధాత్రి 8.15 రేటింగ్ తో ఉన్నాయి. చాలా రోజుల తర్వాత జీ తెలుగుకు చెందిన నాలుగు సీరియల్స్ టాప్ 10లో ఉండటమే కాదు.. అన్నీ 8కి పైగా రేటింగ్ సాధించాయి.
{{/usCountry}}