Serials TRP: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న సీరియల్స్ లేటెస్ట్ వీక్లీ టీఆర్పీ (TRP) రేటింగ్స్ వచ్చేసాయి. 22వ వారానికి సంబంధించి రిలీజ్ అయిన ఈ రేటింగ్స్‌లో 'స్టార్ మా' (Star Maa), 'జీ తెలుగు' (Zee Telugu) ఛానెళ్ల మధ్య భలే పోటీ కనిపిస్తోంది. అర్బన్ + రూరల్ (U+R) డేటా ఆధారంగా ఈ వారం కూడా స్టార్ మా ఛానెల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, జీ తెలుగు తనదైన శైలిలో సీరియల్స్‌తో గట్టి ఫైట్ ఇస్తోంది.
Star Maa Serials | వన్‌సైడ్ వార్.. 'కార్తీక దీపం 2' నంబర్ వన్

తెలుగు టీవీ సీరియల్స్ లో 'కార్తీక దీపం 2' క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ సీరియల్ తాజాగా 22వ వారం కూడా 10.94 రేటింగ్‌తో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. దీనికి పోటీగా 'గుండె నిండా గుడి గంటలు' 10.63 రేటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. 'ఇంటింటి రామాయణం' (9.76), 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (9.69), 'పొదరిల్లు' (9.26) సీరియల్స్ టాప్ 5 స్థానాలను ఆక్రమించి స్టార్ మా పవర్ ఏంటో చూపించాయి.
Zee Telugu Serials | రేసులోకి దూసుకొచ్చిన 'జయం'
జీ తెలుగు ఛానెల్ లోని సీరియల్స్ కూడా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొత్త సీరియల్ 'జయం' 7.04 రేటింగ్‌తో జీ తెలుగులో నంబర్ వన్‌గా నిలవడమే కాకుండా, ఓవరాల్ టాప్ 10 రేసులో 6వ ప్లేస్ ను సాధించింది.
ఆ తర్వాత స్థానాల్లో 'చామంతి' (6.95), 'జగద్ధాత్రి' (6.41) మంచి రేటింగ్స్‌తో స్టడీగా సాగుతున్నాయి. జీ తెలుగులోని 'మేఘసందేశం' కూడా టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకుంది.
టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ ఇలా..
| ర్యాంక్ | సీరియల్ పేరు | ఛానెల్ | U+R రేటింగ్ |
|---|---|---|---|
| 1 | కార్తీక దీపం 2 | స్టార్ మా | 10.94 |
| 2 | గుండె నిండా గుడి గంటలు | స్టార్ మా | 10.63 |
| 3 | ఇంటింటి రామాయణం | స్టార్ మా | 9.76 |
| 4 | ఇల్లు ఇల్లాలు పిల్లలు | స్టార్ మా | 9.69 |
| 5 | పొదరిల్లు | స్టార్ మా | 9.26 |
| 6 | జయం | జీ తెలుగు | 7.04 |
| 7 | చామంతి | జీ తెలుగు | 6.95 |
| 8 | జగద్ధాత్రి | జీ తెలుగు | 6.41 |
| 9 | నువ్వులేక నేనులేను | స్టార్ మా | 5.82 |
| 10 | మేఘసందేశం | జీ తెలుగు | 5.58 |
హెచ్‌టీ విశ్లేషణ
డిజిటల్ కంటెంట్ రంగంలో ఉన్న అనుభవంతో టీవీ రేటింగ్స్ విశ్లేషిస్తే.. స్టార్ మా ఛానెల్ తన పాత క్లాసిక్ సీరియల్స్ తో తన ప్రేక్షకులను నిలుపుకోగలుగుతోంది. 'కార్తీక దీపం 2' లాంటి ఫ్యామిలీ ఎమోషన్ సీరియల్స్ కి ఇప్పటికీ తెలుగు ఇళ్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. జీ తెలుగు సీరియల్స్ చాలా రోజులుగా పోటీ ఇవ్వాలని చూస్తున్నా.. టాప్ 5లోకి మాత్రం రాలేకపోతున్నాయి. కొన్నాళ్లుగా ఓటీటీ కారణంగా రేటింగ్స్ క్రమంగా కోల్పోతున్న ఈ సమయంలో స్టార్ మా సీరియల్స్ ను ఢీకొట్టడం జీ తెలుగుకు అంత సులువైన పనిలా కనిపించడం లేదు.
People Also Ask (FAQs)
{{/usCountry}}డిజిటల్ కంటెంట్ రంగంలో ఉన్న అనుభవంతో టీవీ రేటింగ్స్ విశ్లేషిస్తే.. స్టార్ మా ఛానెల్ తన పాత క్లాసిక్ సీరియల్స్ తో తన ప్రేక్షకులను నిలుపుకోగలుగుతోంది. 'కార్తీక దీపం 2' లాంటి ఫ్యామిలీ ఎమోషన్ సీరియల్స్ కి ఇప్పటికీ తెలుగు ఇళ్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. జీ తెలుగు సీరియల్స్ చాలా రోజులుగా పోటీ ఇవ్వాలని చూస్తున్నా.. టాప్ 5లోకి మాత్రం రాలేకపోతున్నాయి. కొన్నాళ్లుగా ఓటీటీ కారణంగా రేటింగ్స్ క్రమంగా కోల్పోతున్న ఈ సమయంలో స్టార్ మా సీరియల్స్ ను ఢీకొట్టడం జీ తెలుగుకు అంత సులువైన పనిలా కనిపించడం లేదు.
People Also Ask (FAQs)
{{/usCountry}}ఈ వారం (Week 22) నంబర్ వన్ స్థానంలో నిలిచిన తెలుగు సీరియల్ ఏది?
స్టార్ మా ఛానెల్‌లో వచ్చే 'కార్తీక దీపం 2' సీరియల్ 10.94 రేటింగ్‌తో ఓవరాల్‌గా మొదటి స్థానంలో నిలిచింది.
జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ఎక్కువ టీఆర్పీ సాధించిన సీరియల్ ఏది?
జీ తెలుగులో 'జయం' సీరియల్ 7.04 రేటింగ్‌తో ఆ ఛానెల్‌లో నంబర్ వన్‌గా, ఓవరాల్‌గా 6వ ర్యాంక్ సాధించింది.
టాప్ 5 స్థానాల్లో ఏ ఛానెల్ సీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి?
టాప్ 5 స్థానాల్లో పూర్తిగా 'స్టార్ మా' ఛానెల్ సీరియల్స్ ఆధిపత్యం కనిపిస్తోంది.