పెళ్లయ్యాక జీవితంలోకి ఎక్స్ ల‌వ‌ర్‌-స‌రోగ‌సి మ‌ద‌ర్‌గా మాజీ ప్రేయ‌సి-ఓటీటీలోకి సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ మూవీ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ రొమంటిక్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో అంచనాలు అందుకోలేకపోయిన తెలుసు కదా సినిమా ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Nov 14, 2025, 09:00:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రొమాంటిక్ కామెడీ సినిమాలతో జోరు కొనసాగిస్తున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. మధ్యలో జాక్ తో బ్రేక్ పడ్డా కూడా మరోసారి తెలుసు కదా అంటూ రొమాంటిక్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఇవాళ (నవంబర్ 14) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ (instagram-peoplemediafactory)
ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ (instagram-peoplemediafactory)

తెలుసు కదా ఓటీటీ

సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ రొమాంటిక్ మూవీ తెలుసు కదా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో తెలుసు కదా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయిదు భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది.

నెల రోజుల్లోనే ఓటీటీ

తెలుసు కదా మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 17, 2025న థియేటర్లలో రిలీజైంది. నీరజ్ కోనా ఈ సినిమాతో డైరెక్టర్ గా డెబ్యూ చేశారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు, రోహిణి, అన్నపూర్ణ తదితరులు నటించారు. రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన తెలుసు కదా సినిమా కేవలం రూ.11.2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై దీన్ని నిర్మించారు.

తెలుసు కదా కథ

తెలుసు కదా మూవీ కథ లేటెస్ట్ ట్రెండ్ గా సరిపోయే కథ. ఇది మల్టీపెక్స్ ఆడియన్స్ ను ఆకట్టుకునే స్టోరీ అని చెప్పొచ్చు. పెళ్లయిన వ్యక్తి జీవితంలోకి మాజీ ప్రేయసి రావడమనే లైన్ చాలా సినిమాల్లో చూసిందే. కానీ తెలుసు కదాలో ఓ డిఫరెంట్ రీజన్ ఉంటుంది.

వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ)కు ఎవరూ ఉండరు. అనాథగా పెరుగుతాడు. ఓ ఫ్యామిలీ కావాలనుకుంటాడు. కాలేజీ డేస్ లో రాగ (శ్రీనిధి శెట్టి)ని ప్రేమిస్తాడు. కానీ రాగ మాత్రం వరుణ్ కు దూరమవుతుంది. ఆ తర్వాత చెఫ్ గా మారిన వరుణ్ మ్యాట్రిమొని సైట్ ద్వారా అంజలి (రాశీ ఖన్నా)ని కలుస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు.

ఆ ట్విస్ట్

వరుణ్, అంజలి ఎంతో ప్రేమగా ఉంటారు. పిల్లలను కనాలనుకుంటారు. కానీ అప్పుడే ఓ సమస్య వస్తుంది. ఆ దశలోనే రాగ మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. వరుణ్, అంజలి బిడ్డకు తాను సరోగసీ మదర్ గా ఉంటుంది రాగ. మరి అలా ఎందుకు జరిగింది? చివరకు ఏమైంది? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More