...
...
Next Story

Thaai Kizhavi OTT: తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ.. రూ.10 కోట్ల బడ్జెట్ 60 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి రాధిక కామెడీ మూవీ ఆరోజేనా?

Thaai Kizhavi OTT: తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన అతిపెద్ద సంచలనం థాయ్ కిళవి (Thaai Kizhavi). కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.60 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది. ఈ మూవీ మార్చి చివరి వారంలో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

Published on: Mar 14, 2026 09:35 AM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళ నటి రాధికా శరత్‌కుమార్ నటించిన కామెడీ డ్రామా ఈ ఏడాది పెను సంచలనం సృష్టించింది. స్టార్ హీరోలు లేకుండా, కేవలం కంటెంట్‌ను నమ్ముకుని వచ్చిన 'థాయ్ కిళవి' (గాడ్‌మదర్) 2026లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ఏకంగా రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడా మూవీ ఓటీటీలోకి రాబోతుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.

థాయ్ కిళవి ఓటీటీ రిలీజ్ డేట్

Thaai Kizhavi OTT: తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ.. రూ.10 కోట్ల బడ్జెట్ 60 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి రాధిక కామెడీ మూవీ ఆరోజేనా?
Thaai Kizhavi OTT: తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ.. రూ.10 కోట్ల బడ్జెట్ 60 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి రాధిక కామెడీ మూవీ ఆరోజేనా?

థాయ్ కిళవి మూవీ ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైంది. రెండు వారాలకుపైగా బాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తోంది. ఇక ఇప్పుడు అందరి కళ్లూ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పైనే ఉన్నాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా మార్చి చివరి వారంలో అంటే మార్చి 26న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో బజ్ నెలకొంది. జియోహాట్‌స్టార్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

థాయ్ కిళవి మూవీ స్టోరీ ఏంటంటే?

ఈ థాయ్ కిళవి సినిమా కథ అంతా పావునుతాయ్ (రాధికా శరత్‌కుమార్) అనే 70 ఏళ్ల వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. ఊరిలో ఆమె ఒక కరుడుగట్టిన వడ్డీ వ్యాపారి. నోటిదురుసు, మొండితనం ఆమె సొంతం. చివరికి తన ముగ్గురు కొడుకులను కూడా ఆమె తన అదుపులోనే ఉంచుకుంటుంది. అయితే అకస్మాత్తుగా ఆమెకు పక్షవాతం వచ్చి మంచాన పడుతుంది.

ఆమె ఎప్పుడు చనిపోతుందా అని ఊరి జనం, ఆమె దాచిన ఆస్తి ఎక్కడ ఉందో అని ఆమె కొడుకులు ఎదురుచూస్తూ ఉంటారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న పావునుతాయ్, తన వేలితో ఏదో సైగ చేస్తూ ఒక రహస్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఆ రహస్యం ఏంటి? ఒక పరాయి వ్యక్తి వచ్చి ఆమె వద్ద ఉన్న '160 తులాల బంగారం' గురించి అడిగినప్పుడు ఏం జరిగింది? అనే అంశాలను దర్శకుడు శివకుమార్ మురుగేషన్ నవ్వులు పూయిస్తూనే, భావోద్వేగంగా తెరకెక్కించాడు.

థాయ్ కిళవి మూవీ విశేషాలు

63 ఏళ్ల వయసులో రాధికా ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. మంచంపై ఉండి కూడా కేవలం కళ్లతో, హావభావాలతో ఆమె పండించిన నటన సినిమాకు అతిపెద్ద బలం. పల్లెటూరి నేపథ్యంలో సాగే సిట్యుయేషనల్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ముఖ్యంగా సింగం పులి, బాల శరవణన్, మునిష్ కాంత్ ల కామెడీ టైమింగ్ అద్భుతంగా కుదిరింది.

ఈ సినిమాను ప్రముఖ హీరో శివకార్తికేయన్ నిర్మించడం వల్ల మంచి ప్రమోషన్ దక్కింది. కేవలం సెంటిమెంట్‌కే పరిమితం కాకుండా, మహిళల ఆర్థిక స్వేచ్ఛ గురించి ఈ సినిమాలో చర్చించిన విధానం మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.

ఈ సినిమా విజయంతో నిర్మాత శివకార్తికేయన్.. రాధికకు రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో కూడా వాటా ఇచ్చాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక సీనియర్ నటికి లాభాల్లో వాటా ఇవ్వడం ఇదే మొదటిసారి అని రాధికనే స్వయంగా చెప్పింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe