Thaai Kizhavi OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్టార్ హీరోలు లేకపోయినా 150 కోట్లు.. తెలుగులోనూ రిలీజ్
Thaai Kizhavi OTT: ఎలాంటి స్టార్ హీరోలు లేకపోయినా బాక్సాఫీస్ ను షేక్ చేసిన తమిళ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజై అదరగొట్టిన మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
సర్ ప్రైజింగ్ హిట్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసిన తమిళ సినిమా ‘థాయ్ కిళవి’ ఓటీటీలోకి వచ్చేసింది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజు నుంచి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

థాయ్ కిళవి ఓటీటీ
ఎలాంటి స్టార్ హీరోలు లేకుండా వచ్చిన ‘థాయ్ కిళవి’ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. థియేటర్లలో సత్తాచాటింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన సినీ లవర్స్ ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. థాయ్ కిళవి మూవీ శుక్రవారం (ఏప్రిల్ 10) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది.
తెలుగులోనూ
తమిళ బ్లాక్ బస్టర్ మూవీ థాయ్ కిళవి మూవీని తెలుగులోనూ చూడొచ్చు. ఈ మూవీ ఇవాళ నుంచి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ కు తెలుగు ఆడియన్స్ కు ఈ మూవీ ఓ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
బ్లాక్ బస్టర్
థాయ్ కిళవి బ్లాక్ బస్టర్ గా కలెక్షన్ల దుమ్ము రేపింది. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు ఖాతాలో వేసుకుంది. ఇందులో రాధికా శరత్ కుమార్ ఓ కఠినమైన వడ్డీ వ్యాపారీగా నటించింది. ఈ సినిమాను హీరో శివ కార్తికేయన్ తన బ్యానర్ పై నిర్మించాడు. దీనికి శివకుమార్ మురుగేషన్ డైరెక్టర్.
థాయ్ కిళవి స్టోరీ
థాయ్ కిళవి సినిమా 70 ఏళ్ల వయసున్న, ధైర్యవంతురాలైన వడ్డీ వ్యాపారి పావునుత్తాయి (రాధికా శరత్‌కుమార్) చుట్టూ తిరుగుతుంది. తన కొడుకులు ఆస్తిని పంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఆస్తి కోసం గొడవలు పెడతారు. అయితే పావునుత్తాయి మాత్రం చనిపోయేంతవరకూ తన ఆస్తినే తానే అనుభవిస్తానని చెప్తుంది.
రహస్య నిధి
పావునుత్తాయి పక్షవాతానికి గురి కావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆమె సంపాదించిన డబ్బును సీక్రెట్ గా దాచి పెట్టిందని కొడుకులు అనుకుంటారు. ఆ రహస్య నిధిని దక్కించుకోవాలని ఆమె దురాశపరులైన కొడుకులు తిరిగి వస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అనేది థాయ్ కిళవి మూవీలో చూడాల్సిందే.
ఇందులో సింగంపూలి, అరుణ్ డోస్, బాలా శరవణన్, మునీష్కాంత్, ఇలావరసు, జార్జ్ మరియన్, వెట్టై ముత్తుకుమార్ కూడా నటించారు. ముఖ్యంగా రాధికా శరత్ కుమార్ తన యాక్టింగ్ తో మెప్పించారనే కామెంట్లు వస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


