Jana Nayakudu: అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే ‘జన నాయకుడు’ వస్తున్నాడు.. మొత్తానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

Jana Nayakudu: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) రిలీజ్ డేట్ ను మొత్తానికి మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే అంటే జులై 23నే మూవీ రిలీజ్ కానుంది.

Published on: Jul 15, 2026, 15:45:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jana Nayakudu: కోలీవుడ్ సూపర్‌స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' రిలీజ్ డేట్ అఫీషియల్‌గా వచ్చేసింది. జులై 23, 2026న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్‌మెంట్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ అవతారంలో కనిపించి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు.

Jana Nayakudu: అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే ‘జన నాయకుడు’ వస్తున్నాడు.. మొత్తానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
Jana Nayakudu: అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే ‘జన నాయకుడు’ వస్తున్నాడు.. మొత్తానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

అగ్నిపరీక్షకు నిలిచిందంటూ..

జన నాయగన్ మూవీ మేకర్స్ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.. ఈ సినిమా గురించి చెబుతూ.. “అగ్ని పరీక్షకు నిలిచింది.. కాలంతోపాటు బలపడింది.. చరిత్ర సృష్టించిడానికి నిర్మించబడింది.. పోరాటం ఎంత కఠినమైతే.. విజయం సౌండ్ అంత గట్టిగా ఉంటుంది” అనే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దీనికి ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా జత చేశారు.

హెచ్ వినోద్ ఇంటెన్స్ మార్క్.. పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్

ఈ జన నాయగన్ సినిమాను తెలుగులో 'జన నాయకుడు', హిందీలో 'జన్ నేత' పేరుతో ఒరిజినల్ తమిళ వెర్షన్ తో పాటు ఒకేసారి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యాన్స్ కు అసలైన సర్‌ప్రైజ్ విజయ్ టైటిల్ కార్డ్ చేంజ్ కావడం. ఇప్పటివరకు 'దళపతి'గా స్క్రీన్ పై కనిపించిన ఆయన.. ఇప్పుడు "గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్" పేరుతో రీ-ఇంట్రడ్యూస్ కాబోతున్నారు.

ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను ఇంటెన్స్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో 'థీరన్ అధికారం ఒండ్రు', 'తునివు', 'వలిమై' లాంటి మైండ్ బ్లోయింగ్ సినిమాలతో తన మార్క్ చూపించిన వినోద్.. ఈసారి విజయ్ రియల్ లైఫ్ పొలిటికల్ ఎంట్రీకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే స్క్రిప్ట్ రెడీ చేశారు. సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ హై లెవెల్ లో ఉండబోతున్నాయని ఇన్సైడ్ టాక్.

పూజా హెగ్డే కంబ్యాక్.. సాలిడ్ కాస్టింగ్

సినిమాలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ గా నటించింది. 'బీస్ట్' సినిమా సక్సెస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ కావడంతో స్క్రీన్ కెమిస్ట్రీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

'యానిమల్', 'కంగువ' సినిమాలతో విలనిజంలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. మాలీవుడ్ సెన్సేషన్ 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు ఒక కీ రోల్ లో కనిపించబోతోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ప్లాన్.. అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండటంతో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

విజయ్ కెరీర్ లో ఇదే లాస్ట్ సినిమా కావడంతో రాబోయే రోజుల్లో ప్రమోషనల్ క్యాంపెయిన్ మరింత అగ్రెసివ్ గా ప్లాన్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ అవ్వడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More