...
...
Next Story

Jana Nayagan producer: జన నాయగన్ ప్రొడ్యూసర్‌కు సీఎం విజయ్ సర్కార్ కీలక పదవి.. ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్స్

Jana Nayagan producer: దళపతి విజయ్ చివరి మూవీ జన నాయగన్ ను నిర్మించిన ప్రొడ్యూసర్ కేవీఎన్ వెంకట నారాయణకు తమిళనాడు ప్రభుత్వం కీలకమైన పదవి ఇచ్చింది. దీంతో నెట్టింట్లో అభిమానుల క్రేజీ రియాక్షన్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 26, 2026, 21:04:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jana Nayagan producer: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత వస్తున్న ఆయన మోస్ట్ అవేటెడ్ చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan). ఈ మూవీ ప్రొడ్యూసర్ కేవీఎన్ వెంకట నారాయణ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండియన్ పాలిటిక్స్ తో పాటు సినిమా సర్కిల్స్ లో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది.

Jana Nayagan producer: జన నాయగన్ ప్రొడ్యూసర్‌కు సీఎం విజయ్ సర్కార్ కీలక పదవి.. ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్స్
Jana Nayagan producer: జన నాయగన్ ప్రొడ్యూసర్‌కు సీఎం విజయ్ సర్కార్ కీలక పదవి.. ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్స్

తమిళనాడు ప్రభుత్వం ఆయనను న్యూ ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ అధికారిక ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 23వ తేదీతో ఉన్న ఈ అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ (GO) శుక్రవారం (జూన్ 26) సడెన్ గా ఇంటర్నెట్ లో లీక్ అవ్వడంతో కోలీవుడ్ టు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఎమ్ సాయి కుమార్ సైన్ చేసిన ఈ ఆర్డర్ కాస్తా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో విపరీతంగా షేర్ అవుతోంది.

ఏడాది పాటు పదవిలో..

ఈ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ప్రకారం వెంకట నారాయణ ఈ పదవిలో ఒక సంవత్సరం పాటు కొనసాగుతారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి లేదా ప్రభుత్వం అవసరం లేదు అనుకునేంత వరకు ఈ తాత్కాలిక పోస్ట్ అమల్లో ఉంటుంది.

ఈ పదవికి సంబంధించిన పూర్తి నిబంధనలు, జీతభత్యాల వివరాలను త్వరలోనే విడిగా అనౌన్స్ చేయబోతున్నట్లు జీవోలో పేర్కొన్నారు. అయితే విజయ్ చివరి సినిమా జన నాయగన్ ఇంకా థియేటర్లలోకి రాకముందే సడెన్ గా ప్రొడ్యూసర్‌కు ఇలాంటి హై-ప్రొఫైల్ పొలిటికల్ పోస్ట్ ఇవ్వడం వెనుక ఏదో పెద్ద స్కెచ్ ఉందంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

బెంగళూరు ప్రొడ్యూసర్‌కు ఢిల్లీ బాధ్యతలా?

ఇటీవలే తమిళనాడు గవర్నర్‌ను కలవడానికి సీఎం విజయ్ వెళ్లినప్పుడు కూడా వెంకట నారాయణ ఆయన పక్కనే ఉన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. "జననాయగన్ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్ లో లీకైనందుకు గవర్నమెంట్ ఇస్తున్న పరిహారం ఇదా?" అంటూ కొందరు ఫ్యాన్స్ క్రేజీ కౌంటర్లు వేస్తున్నారు. ఢిల్లీ లెవెల్లో పాలిటిక్స్ మేనేజ్ చేయడానికి, నేషనల్ లీడర్లతో కనెక్షన్స్ ఏర్పరచుకోవడానికి సాయంగా ఉంటారనే విజయ్ తన ప్రొడ్యూసర్‌ను ఈ పోస్టులోకి తీసుకొచ్చారని ఇన్‌సైడర్ల టాక్.

'జననాయగన్' సినిమాకు ఏమైంది?

స్టార్ డైరెక్టర్ హెచ్ వినోత్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జన నాయగన్'. విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆకాశమంత అంచనాలు ఉన్నాయి.

పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను నిజానికి సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తేవాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి సర్టిఫికేషన్ రావడంలో ఊహించని ఆలస్యం జరగడంతో రిలీజ్ డేట్ ను నిరవధికంగా వాయిదా వేశారు.

భగవంత్ కేసరి రీమేకా?

ఈ గ్యాప్ లోనే గత ఏప్రిల్ లో ఈ సినిమాకు సంబంధించిన మేజర్ టాకీ పార్ట్ హై క్వాలిటీ హెచ్‌డీ వెర్షన్‌లో ఆన్‌లైన్ లో లీకై చిత్ర యూనిట్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ లీకేజ్ ఇష్యూపై సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టి ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేశారు.

టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ, శ్రీలీల లీడ్ రోల్స్ లో వచ్చి సూపర్ హిట్ అయిన 'భగవంత్ కేసరి' సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్ అనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ లీకేజ్ కాంట్రవర్సీలు, సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కారమై సినిమా ఎప్పుడు స్క్రీన్స్ పైకి వస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ టైమ్‌లో ప్రొడ్యూసర్ అధికారికంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో 'జన నాయగన్' బిజినెస్, ప్రమోషన్స్ మరో లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe