...
...
Next Story

మీరు నా కోసం కోట కట్టారు.. మీకోసం నేను సినిమానే వదిలేస్తున్నా: మలేషియాలో అదిరిన దళపతి విజయ్ స్పీచ్

దళపతి విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జన నాయగన్ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ ఈవెంట్ మలేషియాలో జరగడం విశేషం. అతడు ఏమన్నాడో చూడండి.

Published on: Dec 28, 2025, 12:31:54 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి తన చివరి సినిమాగా ప్రచారంలో ఉన్న 'జన నాయగన్' (Jana Nayagan) ఆడియో లాంచ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మలేషియా వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో లక్ష మంది అభిమానుల మధ్య మాట్లాడుతూ.. "నాకు కోట (అధికారం) ఇచ్చిన అభిమానుల కోసం సినిమాను వదిలేస్తున్నా" అని ఎమోషనల్ అయ్యాడు.

దళపతి విజయ్ స్పీచ్ వైరల్

మీరు నా కోసం కోట కట్టారు.. మీకోసం నేను సినిమానే వదిలేస్తున్నా: మలేషియాలో అదిరిన దళపతి విజయ్ స్పీచ్
మీరు నా కోసం కోట కట్టారు.. మీకోసం నేను సినిమానే వదిలేస్తున్నా: మలేషియాలో అదిరిన దళపతి విజయ్ స్పీచ్

శనివారం (డిసెంబర్ 27) మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన 'జన నాయగన్' ఆడియో లాంచ్ ఒక చరిత్ర సృష్టించింది. బుకిత్ జలీల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు ఏకంగా ఒక లక్ష మంది హాజరయ్యారు. ఇది 'మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో కూడా ఎక్కింది. రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్, తన ఫ్యాన్స్ నుద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

"నేను సినిమాలోకి వచ్చినప్పుడు ఇక్కడొక చిన్న ఇసుక గూడు కట్టుకుంటున్నా అనుకున్నా. కానీ మీరందరూ కలిసి నాకోసం ఒక రాజభవనాన్ని కట్టారు. అభిమానులు నాకోసం ఒక 'కోట'ను (Kottai) నిర్మించారు. నాకోసం సర్వస్వం ఇచ్చిన అభిమానుల కోసం నేను నిలబడాలని నిర్ణయించుకున్నా. అందుకే మీకోసం నేను సినిమాను వదిలేస్తున్నా" అని విజయ్ అన్నాడు. తమిళనాడులో 'కొట్టై' అంటే అసెంబ్లీ/సెక్రటేరియట్ అని అర్థం.

"బలమైన శత్రువు ఉండాలి.."

రాజకీయ ప్రత్యర్థులకు పరోక్షంగా వార్నింగ్ ఇస్తూ విజయ్ ఇలా అన్నాడు. "జీవితంలో గెలవాలంటే స్నేహితులు అవసరం లేదేమో కానీ.. ఒక బలమైన శత్రువు కచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం ఇంకా బలంగా మారుతాం. కాబట్టి, 2026లో చరిత్ర పునరావృతం అవుతుంది. ప్రజల కోసం మనం సిద్ధంగా ఉందాం" అని విజయ్ అన్నాడు.

కన్నీళ్లు పెట్టుకున్న నాజర్

విజయ్ నటించిన జన నాయగన్ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. దీనికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండబోతోంది. ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' (The Raja Saab), శివకార్తికేయన్‌ సినిమా 'పరాశక్తి' కూడా అదే సమయంలో రిలీజ్ అవుతున్నాయి.

ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ జనవరి 4, 2026న జీ తమిళ్‌లో ప్రసారం కానుంది. హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, డైరెక్టర్లు అట్లీ, నెల్సన్, లోకేష్ కనగరాజ్ ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe