తమిళ సూపర్ స్టార్, 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన భార్య సంగీత నుండి విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి కారణమని భావిస్తున్న నటి త్రిషతో కలిసి ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు వెళ్లడం గమనార్హం.
విజయ్, త్రిష జంటగా.. చెన్నైలో సందడి

భార్య సంగీత స్వర్ణలింగంతో విడాకుల వివాదం నడుస్తుండగానే, గురువారం (మార్చి 5) రాత్రి చెన్నైలో జరిగిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ విందుకు దళపతి విజయ్, త్రిష జంటగా హాజరయ్యారు.
కలర్ కోఆర్డినేటెడ్ లుక్ లో వీళ్లు కనిపించారు. విజయ్ పట్టు చొక్కా, పంచె ధరించగా.. త్రిష అదే రంగులో ఉన్న పట్టుచీరలో మెరిసిపోయింది. వీరిద్దరూ ఒకే కారులో రావడం, కలిసి వేదికపైకి వెళ్లడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విడాకుల వార్తలు నిజమని వీరు పరోక్షంగా హింట్ ఇస్తున్నారా? లేక ఇది కేవలం స్నేహపూర్వక ప్రయాణమా? అనే చర్చ మొదలైంది.
ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ వ్యక్తిగత వివాదాలు అతని ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
విజయ్ - సంగీత విడాకుల నేపథ్యం
ప్రముఖ వార్తా సంస్థల సమాచారం ప్రకారం, విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, దీనివల్ల తమ మధ్య దూరం పెరిగిందని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
2021 ఏప్రిల్‌లో ఈ విషయం తనకు తెలిసిందని, అప్పటి నుండి మానసిక వేదనను అనుభవిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. విజయ్ తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని కూడా ఆమె పేర్కొన్నట్లు సమాచారం.
{{/usCountry}}2021 ఏప్రిల్‌లో ఈ విషయం తనకు తెలిసిందని, అప్పటి నుండి మానసిక వేదనను అనుభవిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. విజయ్ తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని కూడా ఆమె పేర్కొన్నట్లు సమాచారం.
{{/usCountry}}ఈ విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా విజయ్ సుమారు ₹250 కోట్లు భరణంగా ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ లేదు.
త్రిషతో అనుబంధంపై ఊహాగానాలు
విజయ్, నటి త్రిష కృష్ణన్ మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ గతంలో 'గిల్లి', 'కురువి' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 15 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 'లియో' (2023) సినిమాలో జంటగా నటించడంతో ఈ రూమర్లు మళ్లీ ఊపందుకున్నాయి. త్రిష సోషల్ మీడియాలో విజయ్‌ను ఉద్దేశించి చేసే పోస్టులు కూడా అభిమానుల్లో అనుమానాలను రేకెత్తించాయి.