...
...
Next Story

Gayapadda Simham: భ‌య‌ప‌డ్డ సింహాన్ని కాదు.. థాయ్‌లాండ్‌లో త‌రుణ్ భాస్క‌ర్‌.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీడియో కాల్

Gayapadda Simham: తరుణ్ భాస్కర్ అప్ కమింగ్ కామెడీ ఫిల్మ్ ‘గాయపడ్డ సింహం’. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తరుణ్ భాస్కర్ అటెండ్ కాలేదు. కానీ వీడియో కాల్ లో అందరినీ పలకరించాడు. అసలు ఏమైందో ఇక్కడ చూడండి.

Published on: Apr 29, 2026, 05:44:05 IST
Advertisement

Gayapadda Simham: ఓ వైపు యాక్టింగ్, మరోవైపు డైరెక్షన్ తో దూసుకెళ్తున్నాడు తరుణ్ భాస్కర్. అతను హీరోగా నటించిన అప్ కమింగ్ మూవీ ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కానీ ఈ ఈవెంట్ కు తరుణ్ భాస్కర్ అటెండ్ కాలేదు.

గాయపడ్డ సింహం ప్రీ రిలీజ్ ఈవెంట్

గాయపడ్డ సింహం ప్రీ రిలీజ్ ఈవెంట్ (x/shreyasgroup)
గాయపడ్డ సింహం ప్రీ రిలీజ్ ఈవెంట్ (x/shreyasgroup)

గాయపడ్డ సింహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో తరుణ్ భాస్కర్ అటెండ్ కాలేకపోయాడు. అతను థాయ్‌లాండ్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని వీడియో కాల్ తో తరుణ్ భాస్కర్ స్పష్టం చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ వాళ్ల అమ్మ ఫోన్ నుంచి తరుణ్ భాస్కర్ వీడియో కాల్ లో మాట్లాడాడు.

ఇండియా వీసా దొరకలేదని

గాయపడ్డ సింహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎందుకు రాలేదని యాంకర్ సుమ అడిగితే.. ఇండియా వీసా దొరకడం లేదని తరుణ్ భాస్కర్ చెప్పాడు. మరి అమ్మ కూడా ఇక్కడే ఉంది, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావని సుమ అడిగేసింది. నాకు రోజూ పెడతారు అని తరుణ్ భాస్కర్ తప్పించుకున్నాడు. ఈవెంట్ కు మిస్ అవకుండా ఉండాల్సిందని అతను అన్నాడు.

భయపడ్డ సింహాన్ని

తరుణ్ భాస్కర్ లైవ్ లో ఉండగానే కమెడియన్ జీవన్ తో సుమ పాట పాడించింది. ‘‘నేను గాయపడ్డ సింహాన్ని.. భయపడ్డ సింహాన్ని కాదు’’ అని తరుణ్ భాస్కర్ కౌంటర్ వేస్తాడు. ‘‘నువ్వు రాకపోవడంతో మేం బాధపడ్డ సింహాలమయ్యాం’’ అని సుమ ఫన్నీగా చెప్తుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.

గాయపడ్డ సింహం గురించి

తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే గాయపడ్డ సింహం సినిమా ఈవెంట్లకు రాలేకపోయాడు. రీసెంట్ గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లోనూ అతను కనిపించలేదు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీడియో కాల్ లో మాట్లాడాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe