...
...
Next Story

ఈ సినిమా తెలుగింటి భోజనంలాగా ఉంటుంది.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ రెడీ చేస్తున్నా: తరుణ్ భాస్కర్ కామెంట్స్

టాలీవుడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ తాను నటించిన లేటెస్ట్ మూవీ సంతాన ప్రాప్తిరస్తుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు.. తన డైరెక్షన్ లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది మూవీ సీక్వెల్ పైనా స్పందించాడు.

Published on: Nov 12, 2025, 18:20:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్‌కు ఓ డిఫరెంట్ కామెడీ టచ్ ఇచ్చిన డైరెక్టర్లలో ఒకడు తరుణ్ భాస్కర్. మంచి నటుడు కూడా. తాజాగా అతడు నటించిన మూవీ సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 14) రిలీజ్ కానుండగా.. ఇదో తెలుగింటి భోజనంలాగా ఉంటుందని తరుణ్ భాస్కర్ అనడం విశేషం. మధుర ఎంటైర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానెల్ లో మూవీ హీరో విక్రాంత్ తో కలిసి మాట్లాడాడు.

సంతాన ప్రాప్తిరస్తు మూవీపై..

ఈ సినిమా తెలుగింటి భోజనంలాగా ఉంటుంది.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ రెడీ చేస్తున్నా: తరుణ్ భాస్కర్ కామెంట్స్
ఈ సినిమా తెలుగింటి భోజనంలాగా ఉంటుంది.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ రెడీ చేస్తున్నా: తరుణ్ భాస్కర్ కామెంట్స్

హీరో విక్రాంత్ తో తరుణ్ భాస్కర్ మాట్లాడాడు. ఈ సందర్భంగా సంతాన ప్రాప్తిరస్తు మూవీ గురించి అతడు మాట్లాడుతూ.. మొదట ఈ సినిమా చేయొద్దని అనుకున్నానని, కానీ ఈ కాలంలో ఎంతో మంది ఫేస్ చేస్తున్న కిడ్స్ ప్రాబ్లెమ్ గురించి కావడంతో తర్వాత అంగీకరించినట్లు చెప్పాడు. అయితే మూవీ చేసిన తర్వాత తాను చాలా హాయిగా ఫీలయ్యానని, చూసిన తర్వాత మరింత సంతృప్తి కలిగిందని తెలిపాడు. ఈ సినిమా ఓ తెలుగింటి భోజనంలాగా ఉంటుందని అతడు అనడం విశేషం.

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌పై..

నిజానికి సంతాన ప్రాప్తిరస్తు మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ అయినా కూడా మొదట సూపర్ హిట్ మూవీ ఈ నగరానికి ఏమైంది విశేషాలతోనే మొదలైంది. ఈ మూవీని తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే మొదటి సినిమా అంత హిట్ అయినా తర్వాత ముఖ్యంగా ఫ్యాన్స్ దానిని ఓన్ చేసుకున్న తర్వాత సీక్వెల్ తీయాలంటే కాస్త భయంగా ఉందని, వాళ్ల అంచనాలను చాలా భారీగా పెరిగిపోయానని, తాను చాలా ఒత్తిడికి గురవుతున్నానని తరుణ్ భాస్కర్ అన్నాడు. అయితే సీక్వెల్ కచ్చితంగా వస్తుందని కూడా స్పష్టం చేశాడు. ఏదో ఒక రకంగా సినిమాను తీసి ఆడియెన్స్ మీదికి వదలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పాడు.

సంతాన ప్రాప్తిరస్తు మూవీ గురించి..

సంతాన ప్రాప్తిరస్తు మూవీని సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేయగా.. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు. కామెడీ, ఎమోషన్ కలగలిపి సాగిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. లోబడ్జెట్ మూవీ అయినా కూడా తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, వెన్నెల కిశోర్ లాంటి నటులు ఉండటంతో సినిమాలో నవ్వులు గ్యారెంటీ అని తేలిపోయింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe