హిందువుల ఊచకోత.. నిజాలను చెప్పే బెంగాల్ ఫైల్స్.. ఓటీటీలోకి బోల్డెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి ఓ కాంట్రవర్సీ మూవీ రానుంది. బెంగాల్ విభజన నాటి హిందువుల ఊచకోత నేపథ్యంలోని నిజాలను చాటిన బెంగాల్ ఫైల్స్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఈ నెలలోనే ఆ మూవీ ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. 

Published on: Nov 8, 2025, 17:08:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ ది బెంగాల్ ఫైల్స్ రాబోతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యాక సంచలనం క్రియేట్ చేసింది. బెంగాల్ విభజన నాటి హిందువుల ఊచకోత నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. థియేటర్లలో ఓ మోస్తారుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ కానుంది. ఈ నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.

ఓటీటీలోకి ది బెంగాల్ ఫైల్స్ (x/ZEE5India)
ఓటీటీలోకి ది బెంగాల్ ఫైల్స్ (x/ZEE5India)

ది బెంగాల్ ఫైల్స్ ఓటీటీ

బెంగాల్ విభజన నాటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ‘ది బెంగాల్ ఫైల్స్’ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 21 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇవాళ (నవంబర్ 8) అనౌన్స్ చేసింది.

‘‘అటెన్షన్ డిమాండ్ చేసిన స్టోరీ ఇది. బెంగాల్ బోల్డెస్ట్ చాప్టర్ ను విట్నెస్ చేసేందుకు రెడీగా ఉండండి. ది బెంగాల్ ఫైల్స్ జీ5లో నవంబర్ 21న ప్రీమియర్ కానుంది’’ అని జీ5 ఎక్స్ లో పోస్టు చేసింది.

రెండు నెలల తర్వాత

బెంగాల్ ఫైల్స్ మూవీ థియేటర్లో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా? అని ఆడియన్స్ వెయిట్ చేశారు. ఎట్టకేలకు జీ5 ఓటీటీ శనివారం అనౌన్స్ మెంట్ చేసింది. ఈ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్. కథ కూడా ఆయనదే. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ పై అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని నిర్మించారు.

కథ ఏమిటంటే?

ది బెంగాల్ ఫైల్స్ మూవీ 1946, ఆగస్టు 16 నాటి బెంగాల్ యాక్షన్ డే ఆధారంగా తెరకెక్కింది. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ముస్లిమ్స్ హిందువులపై దాడులకు దిగారు. హత్యలు చేశారు. అమ్మాయిలను చెరిచారు. ఈ ఘటనల ఆధారంగా బెంగాల్ ఫైల్స్ ను తెరకెక్కించాడు వివేక్ అగ్నిహోత్రి. అతను ఇప్పటికే ది టష్కెంట్ ఫైల్స్ (2019), ది కశ్మీర్ ఫైల్స్ (2022) సినిమాలు తీశాడు.

విమర్శలు

204 నిమిషాల రన్ టైమ్ బెంగాల్ ఫైల్స్.. భారతీయ సుదీర్ఘమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే చరిత్రను వక్రీకరించారనే కారణంతో ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫ్లాప్ అయింది. రూ.50 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తే రూ.16 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More