OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్- నోట్లో నుంచి పాములు, జీసస్ చిన్ననాటి కథ- తెలుగులో రిలీజ్!

The Carpenters Son OTT Release Today: ఓటీటీలోకి ఇవాళ కాంట్రవర్సీకి గురైన హారర్ థ్రిల్లర్ మూవీ ది కార్పెంటర్స్ సన్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జీసస్ చిన్ననాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో బైబిల్‌కు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. ది కార్పెంటర్స్ సన్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో చూద్దాం.

Published on: Apr 7, 2026, 13:23:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బైబిల్‌లోని వివాదాస్పద కథనాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది కార్పెంటర్ సన్’. ఘోస్ట్ రైడర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హాలీవుడ్ స్టార్ హీరో నికోలస్ కేజ్ ఈ మూవీలో మెయిన్ లీడ్‌లో నటించారు. ఆయనతోపాటు నోవా జుప్, ఎఫ్‌కేఏ ట్విగ్స్, ఐస్లా జాన్‌స్టన్, సౌహీల యాకూబ్, కైతి మనోలిడకి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్- నోట్లో నుంచి పాములు, జీసస్ చిన్ననాటి కథ- తెలుగులో రిలీజ్!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్- నోట్లో నుంచి పాములు, జీసస్ చిన్ననాటి కథ- తెలుగులో రిలీజ్!

హారర్ థ్రిల్లర్ ఫాంటసీ ఎలిమెంట్స్

లోట్ఫీ నాథన్ ది కార్పెంటర్స్ సన్ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే, ఈ సినిమాకు నికోలస్ కేజ్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. హారర్ థ్రిల్లర్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ది కార్పెంటర్స్ సన్ సినిమా భారీ అంచనాల నడుమ గతేడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదల అయింది.

అయితే, ఈ సినిమా ఊహించినట్లుగా సక్సెస్ సాధించలేకపోయింది. చాలా వరకు నెగెటివిటీ తెచ్చుకుంది. ఈ సినిమాను జీసస్ చిన్ననాటి కథ ఆధారంగా తెరకెకక్కించారని సమాచారం. బైబిల్‌కు సంబంధించిన పలు వివాదాస్పద అంశాలను టచ్ చేశారని, ఒక పవిత్రమైన గాథలా కాకుండా ఇష్టమొచ్చిన రీతిలో రూపొందించారని విమర్శలు వచ్చాయి.

అతీంద్రియ శక్తులు ఉన్నట్లుగా

జీసస్‌గా చూపించిన పాత్రను దైవంలా కాకుండా అతీంద్రియ శక్తులు వచ్చినట్లుగా, నోట్లో పాములు రావడం వంటి సీన్లతో తెరకెక్కించారని కామెంట్స్ వినిపించాయి. హారర్, డ్రామా, ఫాంటసీల కలయికగా వచ్చిన ఈ సినిమా అసలు ఏ ఉద్దేశంతో తీశారో అర్థం కాక విమర్శకులు పెదవి విరిచారు.

హాలీవుడ్ విలక్షణ నటుడు అయిన నికోలస్ కేజ్ ఏదైనా సినిమా చేస్తున్నారంటే అందులో ఏదో ఒక వింత ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఈసారి ఆయన సాక్షాత్తూ జీసస్ పెంపుడు తండ్రి అయిన జోసెఫ్ (కార్పెంటర్) పాత్రలో నటించారు. అయితే, ఈ చిత్రం భక్తికి మించి గందరగోళం నిండిన ఒక హారర్ డ్రామాగా మిగిలిపోయిందని ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈజిప్టు సంతతికి చెందిన

ఈజిప్టు సంతతికి చెందిన దర్శకుడు లోట్ఫీ నాథన్ రూపొందించిన ఈ సినిమా బైబిల్‌లో ప్రామాణికం కాని ‘ఇన్ ఫాన్సీ గాస్పెల్ ఆఫ్ థామస్’ ఆధారంగా తెరకెక్కింది. ది కార్పెంటర్స్ సన్ కథ విషయానికొస్తే.. గుహలో కేకల మధ్య ఒకరి జననం జరుగుతుంది.

ఆ తర్వాత హేరోదు రాజు సైనికులు పసిబిడ్డలను మంటల్లో వేస్తారు. అది చూసి ఆ పసిబిడ్డల తల్లుల రోదిస్తుంటారు. ఆ హింస నుంచి తప్పించుకున్న కార్పెంటర్ (నికోలస్ కేజ్), అతని భార్య (ఎఫ్‌కేఏ ట్విగ్స్) తమ కుమారుడితో (నోవా జూప్) కలిసి ఒక మారుమూల గ్రామానికి వెళ్తారు. అక్కడ ఆ బాలుడు ఎవరు?, తనలోని అసాధారణ శక్తులను ఎలా అర్థం చేసుకున్నాడు అనేదే ప్రధాన కథ.

ది కార్పెంటర్స్ సన్ ఓటీటీ రిలీజ్

ఇలా భిన్నాభిప్రాయాలు తెచ్చుకున్న ది కార్పెంటర్స్ సిన్ ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 4) వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో నేటి నుంచి ది కార్పెంటర్స్ సన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాట తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో ది కార్పెంటర్స్ సన్ ఓటీటీ రిలీజ్ అయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More