Tamil Crime Thriller OTT: ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆడియన్స్ ఎప్పుడూ కొత్త థ్రిల్లర్స్ కోసం నెట్టింట గాలిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళం నుంచి మరో ఆసక్తికరమైన చిత్రం ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అదే 'ది డార్క్ హెవెన్'.
స్టోరీ ఏంటంటే?

ఎస్. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ది డార్క్ హెవెన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో కంటే ఓటీటీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా రూపొందింది. ఈ సినిమా కథ అంతా 'మెక్కరై' అనే ఓ మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో ప్రతి ఏడేళ్లకు ఒకసారి, అది కూడా జూన్ నెలలోనే మగవాళ్లు వరుసగా చనిపోతూ ఉంటారు. ఇదొక శాపం అని ఆ ఊరి ప్రజలు బలంగా నమ్ముతుంటారు.
సరిగ్గా అదే సమయానికి ఆ ఊరికి కొత్తగా ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బదిలీపై వస్తాడు. ఈ వరుస మరణాల వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. దర్యాప్తులో భాగంగా ఆ ఊరిలో ఎన్నో తరాలుగా పాతుకుపోయిన చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్‌స్పెక్టర్ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనేది ఈ క్రైమ్ థ్రిల్లర్ అసలు కథ.
ఊహించని ట్విస్టులు
ఈ సినిమాలో సిద్ధు సిద్, తర్షిక నవరత్నరాజ ప్రధాన పాత్రల్లో నటించగా, పాపులర్ నటి రిత్విక, వెలా రామమూర్తి, నిళల్‌గళ్ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సిద్ధు సిద్ తనదైన ఇంటెన్స్ యాక్టింగ్‌తో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. కథను నడిపించిన తీరు, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. కథలోని ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఒకేసారి మూడు ఓటీటీల్లో
సాధారణంగా ఏదైనా సినిమా ఒక ఓటీటీలో వస్తుంది. కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏకంగా మూడు ప్లాట్‌ఫామ్స్‌లో ఒకేసారి స్ట్రీమింగ్‌కు రావడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video), ఆహా తమిళం (Aha Tamil) తో పాటు సింప్లీ సౌత్ (SimplySouth) లో ఈ రోజు నుంచే 'ది డార్క్ హెవెన్' స్ట్రీమింగ్ అవుతోంది.
{{/usCountry}}సాధారణంగా ఏదైనా సినిమా ఒక ఓటీటీలో వస్తుంది. కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏకంగా మూడు ప్లాట్‌ఫామ్స్‌లో ఒకేసారి స్ట్రీమింగ్‌కు రావడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video), ఆహా తమిళం (Aha Tamil) తో పాటు సింప్లీ సౌత్ (SimplySouth) లో ఈ రోజు నుంచే 'ది డార్క్ హెవెన్' స్ట్రీమింగ్ అవుతోంది.
{{/usCountry}}కాబట్టి మీరు కూడా ఈ వీకెండ్‌కు ఏదైనా మంచి మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలని ప్లాన్ చేసుకుంటే ఈ మూవీని ఓ లుక్కేయొచ్చు.