Web series OTT: కిక్కే కిక్కు-ఇవాళ ఓటీటీలోకి వచ్చిన టాప్ 3 వెబ్ సిరీస్‌లు ఇవే-క్రైమ్ థ్రిల్లర్ టు లవ్ డ్రామా-డోంట్ మిస్!

Web series OTT: ఇవాళ ఓటీటీ లవర్స్ కు కిక్కిచ్చేందుకు డిఫరెంట్ జానర్లలో అద్భుతమైన వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఇందులో కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ టు జయసుధ లవ్ డ్రామా ఉన్నాయి. మరి వీటి కథ, నటీనటులు, ఓటీటీలో ఎందుకు చూడాలో అనే వివరాలను ఇక్కడ డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం.

Published on: Oct 30, 2026, 05:48:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Web series OTT: మహిళల ఆధిపత్యం, గ్యాంగ్ వార్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'అక్క'. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

కిక్కే కిక్కు-ఇవాళ ఓటీటీలోకి వచ్చిన టాప్ 3 వెబ్ సిరీస్‌లు ఇవే-క్రైమ్ థ్రిల్లర్ టు లవ్ డ్రామా-డోంట్ మిస్!
కిక్కే కిక్కు-ఇవాళ ఓటీటీలోకి వచ్చిన టాప్ 3 వెబ్ సిరీస్‌లు ఇవే-క్రైమ్ థ్రిల్లర్ టు లవ్ డ్రామా-డోంట్ మిస్!

కథ ఏమిటంటే

1980ల కాలం నాటి పెర్నూరు అనే ఒక కల్పిత దక్షిణ భారత నగరంలో ఈ కథ సాగుతుంది. 800 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని మహిళలే పాలిస్తూ, వాళ్లే సొంత రూల్స్ రాసుకుంటూ అండర్ వరల్డ్‌ను గుప్పెట్లో పెట్టుకుంటారు. ఆ వారసత్వాన్ని కాపాడుకునే క్రమంలో భవానీకి, ఆమె సామ్రాజ్యాన్ని కూల్చాలని వచ్చే రుద్రకు మధ్య జరిగే ఆధిపత్య పోరే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.

నటీనటులు: కీర్తి సురేశ్ (భవానీ), రాధికా ఆప్టే (రుద్ర), తన్వి అజ్మీ, మహేష్ మంజ్రేకర్ తదితరులు.

ఎందుకు చూడాలి?: సాధారణంగా గ్యాంగ్ స్టర్ డ్రామాలు అంటే హీరోల చుట్టూ తిరుగుతాయి. కానీ కేవలం మహిళల నేతృత్వంలో నడిచే అండర్ వరల్డ్ కథ కావడం దీని ప్రత్యేకత. కీర్తి సురేష్, రాధికా ఆప్టే మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్, పవర్ పాలిటిక్స్ ప్రేక్షకులకు ఒక కొత్త థ్రిల్ ఇస్తాయి.

రుద్రవనం పీఎస్

సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి జీ5 (Zee5) లోకి వచ్చిన తెలుగు ఒరిజినల్ సిరీస్ 'రుద్రవనం పీఎస్' బెస్ట్ ఛాయిస్. ఓటీటీ రిలీజ్ కు ముందు ఈ సిరీస్ పై అంచనాలు నెలకొన్నాయి.

కథ ఏమిటంటే

రుద్రవనం అనే ప్రాంతంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా అదృశ్యం అవుతాడు. అదే సమయంలో పోలీసులకు తల లేని ఒక మొండెం దొరుకుతుంది. నిజాయితీ గల ఎస్ఐ శివకుమార్ ఈ కేసును టేకప్ చేస్తాడు. ఆ మిస్ అయిన వ్యక్తికి, ఈ శవానికి ఉన్న లింక్ ఏంటి? ఆ ఊరిలో దాగి ఉన్న చీకటి రహస్యాలు ఏంటి? అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన కథ.

నటీనటులు: నరేశ్ అగస్త్య (ఎస్ఐ శివకుమార్), బెనర్జీ (సీఐ వేణుగోపాల్), శివ ఆలపాటి, సుగాలి సిలోని, రమేష్ కొనంభొట్ల.

ఎందుకు చూడాలి?: మర్డర్ మిస్టరీలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. సమాజంలోని కులవివక్ష, అధికారం చుట్టూ అల్లిన ఈ క్రైమ్ స్టోరీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఆకట్టుకుంటుంది.

లవ్ ఆల్వేస్

క్రైమ్, థ్రిల్లర్ల నుంచి కాస్త రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్లకు జియోహాట్‌స్టార్ లోని 'లవ్ ఆల్వేస్' పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

కథ ఏమిటంటే: ప్రేమలో 'సెకండ్ ఛాన్స్' అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా ఇది. తమ గతాన్ని, సంబంధాలను మర్చిపోయిన కొందరు వ్యక్తులు తమను తాము ఎలా తిరిగి తెలుసుకున్నారు? వారికి జీవితం ఇచ్చిన ఆ రెండో అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నారు? అనేది ఈ సిరీస్ లో చూడాల్సిందే.

నటీనటులు: గౌరీ జి కిషన్, రంజాన్ మహమ్మద్, జయప్రకాశ్, జయసుధ తదితరులు.

ఎందుకు చూడాలి?: ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి, ఫాంటసీ ఎలిమెంట్స్ ను జత చేసి చాలా ఎమోషనల్ గా ఈ సిరీస్ ను తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఏఐ (AI) టెక్నాలజీ ద్వారా ప్రముఖ నటుడు క్రేజీ మోహన్ వాయిస్ ను రీక్రియేట్ చేయడం ఈ సిరీస్ కు మరో హైలైట్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More