OTT Horror: ఓటీటీని వణికిస్తున్న హారర్ క్రైమ్ థ్రిల్లర్- చనిపోయినవాళ్లను బతికించే యంత్రం- ఏడాదిగా ట్రెండింగ్- తెలుగులో!

Mandala Murders OTT Release Telugu: ఓటీటీ లవర్స్‌ను అలరిస్తున్న సైకో-థ్రిల్లర్ హారర్ సిరీస్ మండల మర్డర్స్. చేతబడులు, పౌరాణిక రహస్యాలు, సీరియల్ కిల్లింగ్స్ కలగలిపిన ఈ సైకలాజికల్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను వణికిస్తోంది. మరి మడంల మర్డర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 29, 2026, 15:22:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Mandala Murders OTT Streaming Telugu: డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో థ్రిల్లర్, హారర్, సైకో మిస్టరీ చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరు. అయితే, కేవలం నేరాలు, దర్యాప్తు మాత్రమే కాకుండా మనదేశంలోని ప్రాచీన చేతబడులు, తంత్ర మంత్రాలు, పౌరాణిక నమ్మకాలను జోడిస్తే ఆ థ్రిల్ రెట్టింపు అవుతుంది.

ఓటీటీని వణికిస్తున్న హారర్ క్రైమ్ థ్రిల్లర్- చనిపోయినవాళ్లను బతికించే యంత్రం, చేతబడులతో హత్యలు- తెలుగులో!
ఓటీటీని వణికిస్తున్న హారర్ క్రైమ్ థ్రిల్లర్- చనిపోయినవాళ్లను బతికించే యంత్రం, చేతబడులతో హత్యలు- తెలుగులో!

వణుకుపుట్టించే హారర్ సిరీస్

సరిగ్గా అలాంటి భయాందోళన రేకెత్తించే నేపథ్యంతో రూపుదిద్దుకున్న క్రేజీ ఓటీటీ వెబ్ సిరీస్ 'మండల మర్డర్స్'. స్క్రీన్ నుంచి కన్ను పక్కకు తిప్పుకోకుండా చేసే ట్విస్టులతో సాగే ఈ ఓటీటీ సిరీస్ ప్రస్తుతం డిజిటల్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.

ప్రాచీన తంత్ర వేదం.. 1952 నాటి దారితీసిన సీక్రెట్!

ఉత్తరప్రదేశ్ వాతావరణంలో ఉన్న 'చరణ్‌దాస్‌పూర్' అనే ఊహాజనిత పట్టణం నేపథ్యంలో ఈ కథ ప్రారంభమవుతుంది. 1952వ సంవత్సరంలో 'ఆయస్తి' అనే ఒక రహస్య సమాజం 'ఆయస్త యంత్రం' సాయంతో చనిపోయిన వ్యక్తికి తిరిగి ప్రాణం పోయడానికి దెయ్యాలను అనుష్ఠానం చేస్తుంది.

ఊరి ప్రజలు ఆ భయంకరమైన చేతబడి పద్ధతులను అడ్డుకోవడానికి వారి ఆవాసాలపై దాడి చేసి తగలేస్తారు. అంతటితో ఆ ఘోరం ముగిసిపోయిందని అంతా భావిస్తారు. కానీ, కాలం మారిన తర్వాత మళ్లీ ఆ దెయ్యాల నీడలు విరుచుకుపడతాయి.

నగరంలో వరుసగా భయంకరమైన సీరియల్ హత్యలు మొదలవుతాయి. హతులలో ప్రతి ఒక్కరి శరీరం నుంచి ఏదో ఒక ప్రత్యేకమైన అవయవాన్ని కిరాతకంగా కోసి తీసేస్తారు. అంతేకాకుండా, ప్రతి శవం పక్కన 'మండల' అనే విచిత్రమైన చిహ్నం రాసి ఉంటుంది.

వాణీ కపూర్ డిజిటల్ ఎంట్రీ.. దర్యాప్తులో విస్తుపోయే కోణాలు!

విధి నిర్వహణ నుంచి సస్పెన్షన్‌కు గురైన పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా), డ్యూటీ పట్ల కఠినంగా ఉండే డిటెక్టివ్ రియా థామస్ (వాణీ కపూర్) కలిసి ఈ రాక్షస హత్యల వెనుక ఉన్న నిజాన్ని చేధించే బాధ్యత తీసుకుంటారు.

ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతున్న కొద్దీ, ఒకదాని వెనుక ఒకటి వెలుగు చూసే భయంకర విషయాలు విస్తుపోయేలా చేస్తాయి. ఈ సిరీస్ ద్వారా బాలీవుడ్ భామ వాణీ కపూర్ ఓటీటీ అరంగేట్రం చేయడం విశేషం. గోపీ పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్‌లో వాణీ కపూర్‌తో పాటు సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా, శ్రియా పిల్‌గాంకర్ ప్రధాన పాత్రల్లో మెరిశారు.

ది బట్చర్ ఆఫ్ బెనారస్ నవల ఆధారంగా

ప్రముఖ రచయిత మహేంద్ర జఖార్ 2014లో రాసిన 'ది బట్చర్ ఆఫ్ బెనారస్' నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. మూల నవలలో ఉండే వాటికన్, ఎఫ్‌బీఐ అంశాలను పక్కనబెట్టి, మన భారతీయ తంత్ర మంత్రాలకు, మూఢనమ్మకాలకు తగ్గట్టుగా కథను కథనంగా మార్చి తెరకెక్కించారు.

కథలోని రుక్మిణి పాత్ర కోసం నటి శ్రియా పిల్‌గాంకర్ సీన్లను షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా రాసి చిత్రీకరించారు. ఆ కల్ట్ కాన్సెప్ట్‌కు పౌరాణిక బలాన్ని చేకూర్చడానికే ఈ మార్పులు చేసినట్లు మేకర్స్ తెలిపారు.

ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఏ ఓటీటీలో చూడవచ్చు?

మండల మర్డర్స్ ఓటీటీ సిరీస్ ఐఎమ్‌డీబీలో 6.5 రేటింగ్ సొంతం చేసుకుంది. హారర్, సైకలాజికల్, క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన మండల మర్డర్స్ ఓటీటీలో దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మండల మర్డర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

హిందీతోపాటు తెలుగు, తమిళ వంటి భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో గతేడాది జూలై 25న మండల మర్డర్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అప్పుడే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ సిరీసులో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అయింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏడాదిగా ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది ఈ సిరీస్.

హారర్ థ్రిల్లర్, మిస్టరీ కథలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో చూసేందుకు మండల మర్డర్స్ ది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More