...
...
Next Story

ప్రైమ్ వీడియోలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అరుదైన రికార్డు.. ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్‌గా..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి నటించిన ఈ వెబ్ సిరీస్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Published on: Dec 3, 2025, 22:05:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రైమ్ వీడియోలోకి నాలుగేళ్ల తర్వాత వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్ రికార్డులు తిరగరాస్తోంది. ఈ కొత్త సీజన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ ఏడాది లాంచ్ వీక్ లో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రికార్డు

ప్రైమ్ వీడియోలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అరుదైన రికార్డు.. ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్‌గా..
ప్రైమ్ వీడియోలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అరుదైన రికార్డు.. ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్‌గా..

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఎంతో ఊరించి నాలుగేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ఓటీటీలో ఈ ఏడాది వచ్చిన తొలి వారంలోనే అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా ఈ సిరీస్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.

“ప్రతి ఫ్యామిలీ పాప్ కార్న్ ప్లాన్.. ది ఫ్యామిలీ మ్యాన్.. కొత్త సీజన్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి జత చేసిన పోస్టర్ పై ఈ ఏడాది ప్రైమ్ వీడియోలో లాంచ్ వీక్ లోనే అత్యధిక మంది చూసిన షోగా నిలిచిందని ఆ ఓటీటీ తెలిపింది. అటు ఆర్మాక్స్ వీడియో రిపోర్టులోనూ గత రెండు వారాలుగా అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నిలిచింది.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి..

మనోజ్ బాజ్‌పాయీ ఇందులో స్పై ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా తిరిగి వచ్చాయి. సుచిత్రగా ప్రియమణి, జేకేగా షరీబ్ హష్మి నటించారు. ఈ మూడో సీజన్ మొత్తం ఈశాన్య భారతంలో జరిగిన స్టోరీగా చూపించారు. ఇందులో కొత్త విలన్ గా జైదీప్ అహ్లావత్ వచ్చాడు. అతని నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks