క్రూర‌మైన నేర‌స్థుల‌ను వేటాడే టీమ్‌- అదిరే ట్విస్ట్‌- జియోహాట్‌స్టార్‌లోని ఈ థ్రిల్ల‌ర్ సిరీస్ చూశారా? తెలుగులోనూ

జైలు నుంచి తప్పించుకున్న అత్యంత క్రూరమైన క్రిమినల్స్ ను వేటాడే టీమ్ కథతో వచ్చిన సిరీస్ అదరగొడుతోంది. ఓటీటీలో సత్తాచాటుతోంది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కొత్త సీజన్ ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తుంది. 

Published on: Jan 18, 2026, 17:36:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జైలు నుంచి తప్పించుకున్న అత్యంత క్రూరమైన కిల్లర్లను చంపే టీమ్ కథతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది హంటింగ్ పార్టీ’. ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ఇప్పుడు జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతుంది. అదిరిపోయే యాక్షన్ తో, అంతకుమించిన థ్రిల్ తో ఈ సీజన్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది ది హంటింగ్ పార్టీ సీజన్ 2.

జియోహాట్‌స్టార్‌లోని సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్
జియోహాట్‌స్టార్‌లోని సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

ది హంటింగ్ పార్టీ ఓటీటీ

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఓటీటీ వెబ్ సిరీస్ ల్లో ది హంటింగ్ పార్టీ ఒకటి. ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ది హంటింగ్ పార్టీ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. రెండు ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి శుక్రవారం ఒక కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 2లో మొత్తం 13 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి.

తెలుగులోనూ

ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అయిన ది హంటింగ్ పార్టీ సీజన్ 2 సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సీజన్ ను ఎంజాయ్ చేయొచ్చు. ఇంగ్లీష్, తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఈ సిరీస్ ను చూడొచ్చు. ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో రెండో సీజన్ లోని ‘రాన్ సిమ్స్’, ‘ఆడ్రియన్ గాలో’ ఎపిసోడ్లు చూడటానికి రెడీగా ఉన్నాయి.

ది హంటింగ్ పార్టీ స్టోరీ

ది హంటింగ్ స్టోరీ అనేది ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో అత్యంత రహస్యమైన జైలు ‘ది పిట్’ ఉంటుంది. ఇందులో అత్యంత ప్రమాదకరమైన, క్రూరమైన క్రిమినల్స్ ను ఉంచుతారు. అయితే ఒక సమయంలో కొంతమంది క్రిమినల్స్ దీని నుంచి తప్పించుకుంటారు.

స్పెషల్ టీమ్

జైలు నుంచి తప్పించుకున్న క్రూరమైన క్రిమినల్స్ ను పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేస్తుంది. ఇందులో బెక్స్, షేన్, టెడ్, మల్లోరీ ఉంటారు. సీజన్ 1లో ఒక్కో ఎపిసోడ్ లో తప్పించుకున్న ఒక్కో క్రిమినల్ ను ఈ టీమ్ వేటాడుతుంది. అయితే ది పిట్ వెనుకు ఉన్న సీక్రెట్స్ కూడా క్రమంగా బయటపడతాయి. క్లైమాక్స్ లో బెక్స్ తన బెస్ట్ ఫ్రెండ్ ఒలివర్ ను కోల్పోతుంది.

సీజన్ 2

ది హంటింగ్ స్టోరీ సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఈ సారి టీమ్ లోకి లాజరస్ అనే పవర్ ఫుల్ లేడీ ఎంటర్ అవుతుంది. అయితే అప్పటికే టీమ్ లో ఉన్న షేన్ కు లాజరస్ తల్లి అనే ట్విస్ట్ అదిరిపోతుంది.

సీజన్ 2లో కిల్లర్లను పట్టుకునేందుకు ఈ స్పెషల్ టీమ్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎపిసోడ్ 1లో బూగీమెన్ అనే సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేస్తారు. రెండో ఎపిసోడ్ లో అడ్రియాన్ ను పట్టుకుంటారు. మరోవైపు జైలులోని రహస్యాలు కూడా బయటపడుతుంటాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More