ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు- సైకో కిల్లర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకూ- వీకెండ్ కు బెస్ట్- ఓ లుక్కేయండి

ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాల సందడి కాస్త తక్కువే. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోనే భారీ చిత్రాలు రిలీజ్ కావడంతో ఓటీటీలోకి మూవీస్ తక్కువగానే వచ్చాయి. మరి ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు ఏవి? ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేయండి.

Jan 17, 2026, 17:46:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన కొత్త తెలుగు సినిమాల సంఖ్య తక్కువే. ఇందులో ఈ మూడు చిత్రాలు చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలోకి తెలుగులో సైకో కిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ నుంచి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వరకూ ఉన్నాయి. ఈ స్పెషల్ సినిమాలు వీకెండ్ కు బెస్ట్.

ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు
ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు

దండోరా ఓటీటీ ఓటీటీ

ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాల గురించి చెప్పకుంటే ముందుగా దండోరా మూవీ గురించి మాట్లాడుకోవాలి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో దండోరా సినిమా పేరు ఎక్కువగా వినిపించింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

దండోరా సినిమాకు పాజిటివ్ టాక్ వినిపించింది. ఈ చిత్రంలో శివాజీతో పాటు బిందు మాధవి, రవి కిషన్, నందు, నవదీప్ తదితరులు నటించారు.

గుర్రం పాపిరెడ్డి ఓటీటీ

తెలుగులో రీసెంట్ గా వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్ గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమాలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం ఆశపడే గ్యాంగ్ సమాధుల్లోని శవాలను మార్చాలని అనుకుంటుంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ యువకుడు ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుంటాడు. సమాధుల్లోని శవాలని మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టాలని ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ సక్సెస్ అయిందా? లేదా అనదే గుర్రం పాపిరెడ్డి సినిమాలో చూడాల్సిందే.

కిల్లర్ ఆర్టిస్ట్ ఓటీటీ

ఈ వారం ఓటీటీలో అదరగొడుతున్న మరో తెలుగు సినిమా కిల్లర్ ఆర్టిస్ట్. ఇదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. సైకో కిల్లర్ చుట్టూ మూవీ తిరుగుతుంది. హత్య చేయడం కూడా ఒక ఆర్ట్ అని, చంపేవాడు ఆర్టిస్ట్ అని నమ్మే కిల్లర్ స్టోరీ ఇది. ఈ కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది.

బాహుబలి ప్రభాకర్, బిగ్ బాస్ సోనియా ఆకుల తదితరులు నటించిన ఈ సినిమాలో సస్పెన్స్, ట్విస్ట్ లు అదిరిపోయాయి. హీరో సిస్టర్ ను ఎవరో రేప్ చేసి చంపేస్తారు. హీరోయిన్ ముగుసు వేసుకుని అమ్మాయిలను హత్యలు చేస్తున్న హంతకుణ్ని పోలీసులు పట్టుకుంటారు. తన సిస్టర్ ను కూడా అతనే చంపాడని హీరో పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ అప్పుడే ఓ అదిరే ట్విస్ట్ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే ప్రైమ్ వీడియోలోని కిల్లర్ ఆర్టిస్ట్ చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More