వివాదాస్పద మూవీ ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ విధించిన 15 రోజుల స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ సినిమాకు చట్టపరమైన చిక్కులు తొలగిపోయినట్లే. జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ పి.వి. బాలకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ది కేరళ స్టోరీ 2 వివాదం, నేపథ్యం ఇదీ..

ముందుగా ది కేరళ స్టోరీ 2 సినిమాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బెచు కురియన్ థామస్ (సింగిల్ బెంచ్).. సినిమా విడుదలను 15 రోజుల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా సెన్సార్ బోర్డు (CBFC) ఛైర్మన్ రెండు వారాల్లోగా ఈ ఫిర్యాదులను పరిశీలించాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నిర్మాత విపుల్ షా వెంటనే డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాడు.
కోర్టులో జరిగిన వాదనలు
ఈ అప్పీల్‌పై గురువారం (ఫిబ్రవరి 26) రాత్రి 7:30 గంటలకు హైకోర్టు ప్రత్యేకంగా అత్యవసర విచారణ చేపట్టింది. నిర్మాత తరపున సీనియర్ న్యాయవాదులు ఎల్విన్ పీటర్, నీరజ్ కిషన్ కౌల్ తమ వాదనలు వినిపించారు. సమాజంలోని దురాచారాలను ఎత్తిచూపే హక్కు కథకుడికి ఉంటుందని, గతంలో ఇతర మతాల విషయంలోనూ కోర్టులు ఇదే తరహాలో జోక్యం చేసుకోలేదని వారు గుర్తు చేశారు.
మరోవైపు సినిమా విడుదల కాకపోతే తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని విపుల్ షా కోర్టుకు విన్నవించారు. దేశవ్యాప్తంగా 1500 థియేటర్లలో, విదేశాల్లో 300 స్క్రీన్లలో ఫిబ్రవరి 27న సినిమాను ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ సినిమా ఏ రాష్ట్రానికి లేదా ఏ మతానికి వ్యతిరేకం కాదని, కేవలం సామాజిక సమస్యను మాత్రమే ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ సినిమా విడుదలకు అనుమతినిచ్చింది. పూర్తి స్థాయి తీర్పు ప్రతి త్వరలోనే వెలువడనుంది.
ది కేరళ స్టోరీ 2 సినిమా గురించి..
{{/usCountry}}ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ సినిమా విడుదలకు అనుమతినిచ్చింది. పూర్తి స్థాయి తీర్పు ప్రతి త్వరలోనే వెలువడనుంది.
ది కేరళ స్టోరీ 2 సినిమా గురించి..
{{/usCountry}}కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ 2’లో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓఝా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమ పేరుతో హిందూ యువతులను ట్రాప్ చేసే అంశాలను ఈ చిత్ర ట్రైలర్‌లో చూపించడంతో ఇది రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎట్టకేలకు న్యాయస్థానం క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.