బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మూవీ 'ది కేరళ స్టోరీ'. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' (The Kerala Story 2 Goes Beyond) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విపుల్ అమృత్ లాల్ షా నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 17) విడుదల చేశారు. మొదటి భాగం కంటే ఇది మరింత తీవ్రంగా, భయానకంగా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
మూడు రాష్ట్రాలు.. మూడు విషాద గాథలు..

రాబోయే 25 ఏళ్లలో ఇండియా మొత్తం షరియా చట్టంతో పాలించే ఇస్లామిక్ స్టేట్‌గా మారుతుందనే హెచ్చరికతో ది కేరళ స్టోరీ 2 మూవీ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ మూడు వేర్వేరు రాష్ట్రాల్లోని ముగ్గురు హిందూ యువతుల జీవితాల చుట్టూ తిరుగుతుంది.
రాజస్థాన్ లో 16 ఏళ్ల తమ కూతురిని బలవంతంగా మత మార్పిడి చేశారని ఒక కుటుంబం పోలీస్ స్టేషన్‌లో పోక్సో (POCSO) కేసు పెడుతుంది. ఇటు మధ్యప్రదేశ్ లో పెళ్లి పేరుతో మోసం చేసి, ఒక హిందూ యువతిని వలలో వేసుకుని, ఆ తర్వాత మత మార్పిడికి గురిచేసే ఉదంతం చూపిస్తారు. మరోవైపు కేరళ లో లివ్-ఇన్ రిలేషన్షిప్ పేరుతో దగ్గరై, మతం మారనందుకు ఒక యువతిని బంధించి, బలవంతంగా గొడ్డు మాంసం (బీఫ్) తినిపించి చిత్రహింసలకు గురిచేసే మరోకథ కూడా ఇందులో చూపించారు.
"ఈసారి మౌనంగా ఉండం.."
"వాళ్ళు మన కూతుళ్లను టార్గెట్ చేశారు. నమ్మకాన్ని వమ్ము చేశారు. భవిష్యత్తును నాశనం చేశారు. ఈసారి మనం మౌనంగా ఉండకూడదు.. సహించేది లేదు.. పోరాడుదాం" అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు "గూస్‌బంప్స్ వచ్చాయి, నిజాలు బయటపెడుతున్నారు" అని ప్రశంసిస్తుంటే.. మరికొందరు "ఇది మరో ప్రాపగండా (Propaganda) సినిమా" అని విమర్శిస్తున్నారు.
ది కేరళ స్టోరీ 2 నటీనటులు, విశేషాలు
ఈ కేరళ స్టోరీ 2 సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఉల్కా గుప్తా, అదితీ భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్ లాల్ షా, ఆశిన్ ఎ షా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివాదాలు, ఆసక్తి నడుమ 'ది కేరళ స్టోరీ 2' ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
{{/usCountry}}ఈ కేరళ స్టోరీ 2 సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఉల్కా గుప్తా, అదితీ భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్ లాల్ షా, ఆశిన్ ఎ షా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివాదాలు, ఆసక్తి నడుమ 'ది కేరళ స్టోరీ 2' ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
{{/usCountry}}