...
...
Next Story

OTT Romance: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన రొమాంటిక్ డ్రామా.. యూత్‌కు క‌నెక్ట్ అయ్యే మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌!

OTT Romance: రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే యూత్ కోసం ఓ అదిరిపోయే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నేరుగా డిజిటల్ డెబ్యూ చేసింది. ఈ ఇంగ్లీష్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ సినిమా ఏంటీ? ఇందులో యూత్ కనెక్ట్ అయ్యే అంశాలు ఏమున్నాయో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 26, 2026, 13:54:52 IST
Advertisement

OTT Romance: ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు మరో ఆసక్తికరమైన రొమాంటిక్ డ్రామా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పాఠకుల ఆదరణ పొందిన నవల ‘ది లాస్ట్ సన్ రైజ్’ ఆధారంగా తెరకెక్కిన 'ది లాస్ట్ సన్‌రైజ్' (The Last Sunrise) సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైంది.

ది లాస్ట్ సన్‌రైజ్ ఓటీటీ

డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన రొమాంటిక్ డ్రామా.. యూత్‌కు క‌నెక్ట్ అయ్యే మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌!
డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన రొమాంటిక్ డ్రామా.. యూత్‌కు క‌నెక్ట్ అయ్యే మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌!

ఓటీటీలోకి మరో రొమాంటిక్ డ్రామ ది లాస్ట్ సన్‌రైజ్ వచ్చేసింది. ఇవాళ (ఆగస్టు 26) నుంచి పాపులర్ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో (Prime Video) లో ఈ ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, ఎమోషన్స్, అనుకోని ట్విస్టుల కలయికగా సాగే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఇండియన్ ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

తెలుగుతో సహా 6 భాషల్లో

ఈ ది లాస్ట్ సన్‌రైజ్ సినిమా ఇంగ్లీష్‌ ఒరిజినల్‌ వర్షన్‌తో పాటు భారతీయ ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. భాషా సరిహద్దులు లేకుండా ప్రతీ ఒక్కరూ వీక్షించేలా మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 1 గంట 46 నిమిషాల (106 నిమిషాలు) నిడివి ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్ కేటాయించింది.

కథేమిటంటే?

తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న 'రై' (మాయా రెఫిక్కో) అనే కాలేజీ విద్యార్థిని చుట్టూ ఈ ది లాస్ట్ సన్‌రైజ్ సినిమా కథ తిరుగుతుంది. రోజువారీ జీవితంలోని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆమె తన తల్లి (ఎవా లాంగోరియా) తో కలిసి మల్లోర్కా అనే అందమైన ప్రాంతానికి వేసవి సెలవుల్లో వెళ్తుంది.

అయితే, వారి సంతోషం ఎక్కువ కాలం నిలవదు. ఒకవైపు రై ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణించడం, మరోవైపు చాలా కాలంగా దాగి ఉన్న కుటుంబ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో వారి ప్రేమ ప్రయాణంలో అలజడి మొదలవుతుంది. వేసవి ముగిసేలోపే ఆమె జీవితం ఏ మలుపు తిరిగింది? రై తన అనారోగ్యాన్ని, కుటుంబ రహస్యాలను తట్టుకుని నిలబడగలిగిందా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

యూత్ కు నచ్చేలా

ది లాస్ట్ సన్‌రైజ్ మూవీని యూత్ కు నచ్చేలా తీర్చదిద్దారు. మంచి లవ్, రొమాంటిక్ ఫీల్ ను ఇస్తుంది ఈ మూవీ. సినిమాలో రై పాత్రలో మాయా రెఫిక్కో తన అభినయంతో ఆకట్టుకోగా, తల్లి పాత్రలో ప్రముఖ నటి ఎవా లాంగోరియా కనిపించారు. జూలియన్ పాత్రలో ఫెర్నాండో లిండేజ్ నటన యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. రొమాంటిక్ డ్రామాలను, నవల ఆధారిత కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతిని అందిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe