...
...
Next Story

The Odyssey: ఒక్క టికెట్ రూ.3 వేలా.. భారీ ధరలతో టికెట్ల అమ్మకాలపై ప్రభావం.. ఓపెన్‌హైమర్‌తో పోలిస్తే వెనుకబడిన ది ఒడిస్సీ

The Odyssey: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ ది ఒడిస్సీ టికెట్ల ధరలకు చుక్కలనంటుతున్నాయి. ఈ మూవీకి ఉన్న క్రేజ్ ను మల్టీప్లెక్స్ లు వాడుకుంటున్నాయి. అయితే ఈ భారీ ధరలే మూవీ టిెకెట్ల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి.

Published on: Jul 14, 2026, 22:12:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

The Odyssey: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మోస్ట్ ఏవైటెడ్ ఎపిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామా 'ది ఒడిస్సీ' ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన ఓపెనింగ్స్ రాబట్టేందుకు రెడీ అయింది. ఇండియాలో మొదటి రోజే ఈ విజువల్ వండర్ ఏకంగా రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

ఓపెన్‌హైమర్‌తో పోలిక.. టికెట్ ధరల షాక్

The Odyssey: ఒక్క టికెట్ రూ.3 వేలా.. భారీ ధరలతో టికెట్ల అమ్మకాలపై ప్రభావం.. ఓపెన్‌హైమర్‌తో పోలిస్తే వెనుకబడిన ది ఒడిస్సీ
The Odyssey: ఒక్క టికెట్ రూ.3 వేలా.. భారీ ధరలతో టికెట్ల అమ్మకాలపై ప్రభావం.. ఓపెన్‌హైమర్‌తో పోలిస్తే వెనుకబడిన ది ఒడిస్సీ

అయితే ఈ భారీ అంచనాల మధ్యే ది ఒడిస్సీ సినిమా టికెట్ రేట్లు ఇప్పుడు సోషల్ మీడియాో హాట్ టాపిక్‌గా మారాయి. నోలన్ గత ఇండస్ట్రీ హిట్ 'ఓపెన్‌హైమర్' సినిమాతో పోలిస్తే ఈసారి ఇండియాలో టికెట్ ధర చాలా ప్రీమియంగా పెట్టారు. మెట్రో సిటీస్ లో రేట్లు భారీగా పెరగడం కలెక్షన్ల లెక్కలను మారుస్తోంది.

ఐమాక్స్ స్క్రీన్స్ దగ్గర తగ్గుతున్న ఫుట్‌ఫాల్స్

ముఖ్యంగా ఐమాక్స్ (IMAX) లాంటి ప్రీమియం ఫార్మాట్లలో టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకడంతో సాధారణ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి కాస్త వెనకాడుతున్నారు. ఈ విపరీతమైన రేట్ల వల్ల థియేటర్లలో ఫుట్‌ఫాల్స్ అంటే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతున్నట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సినిమా చూడాలనుకునే మిడిల్ క్లాస్ సినీ లవర్స్ ఈ ధరల పెంపు వల్ల సాధారణ స్క్రీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఢిల్లీలో అయితే గరిష్ఠంగా రూ.3100 వరకు రిక్లెయినర్స్ రేట్లు ఉన్నాయి. అటు ముంబైలోనూ రూ.2500 వరకు ఉండగా.. బెంగళూరులో రూ.2 వేల లోపే ఉన్నాయి. చెన్నైలో మాత్రం ఐమాక్స్ టికెట్లు కూడా గరిష్ఠంగా రూ.508 మాత్రమే ఉండటం విశేషం.

కలెక్షన్ల వేటలో అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్

యావరేజ్ టికెట్ ప్రైస్ (ATP) ఓపెన్‌హైమర్ బయోపిక్ కంటే చాలా ఎక్కువగా ఉండటంతో తక్కువ మంది వచ్చినా కలెక్షన్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

నోలన్ ఇండియా టూర్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్

క్రిస్టోఫర్ నోలన్‌కు ఇండియాలో, ముఖ్యంగా సౌత్ సినీ లవర్స్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియన్ ఫ్యాన్స్ మీద ఉన్న గౌరవంతో నోలన్ రీసెంట్‌గా ఇండియాలో పర్యటించి తన సినిమాను పర్సనల్‌గా ప్రమోట్ చేశారు.

గతంలో 'ఇన్సెప్షన్', 'ఇంటర్‌స్టెల్లార్', 'ది డార్క్ నైట్' లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూలు చేసిన ట్రాక్ రికార్డ్ నోలన్‌కు ఉంది. ఆ నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ భారీగా థియేటర్లను బ్లాక్ చేశారు.

బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఖాయమా?

ఒకవేళ ఈ ఎపిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం థియేటర్లలో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చూడటం గ్యారెంటీ. భారీ ప్రొడక్షన్ వాల్యూస్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఉన్న ఈ సినిమా ఇండియన్ థియేట్రికల్ మార్కెట్‌లో హాలీవుడ్ రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించబోతోంది. లాంగ్ రన్ లో ఈ ప్రాజెక్ట్ ఇండియాలో ఏ రేంజ్ బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe