Nani The Paradise 3 Days Worldwide Box Office Collection: 'దసరా' వంటి ఊరమాస్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'ది ప్యారడైజ్'. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.
పెరుగుతున్న పాజిటివ్ టాక్

మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో సునామీ సృష్టిస్తోంది ది ప్యారడైజ్ సినిమా. విమర్శకుల నుంచి కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, నాని మాస్ ఇమేజ్, ఓపెనింగ్స్ హవా కలెక్షన్లను గట్టిగా నిలబెట్టాయి. ఇప్పుడు క్రమంగా ది ప్యారడైజ్ సినిమాకు పాజిటివ్ టాక్ పెరుగుతూ వస్తోంది.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జాతర
ది ప్యారడైజ్ సినిమా బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి ప్రీమియర్ షోలతో మొదలై, గురువారం (సెప్టెంబర్ 24) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాని కెరీర్‌లోనే అత్యధికంగా రూ.46.25 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇందులో ఒక్క గురువారం రాత్రి ప్రీమియర్ షోల నుంచే రూ.11.60 కోట్లు రాగా, తొలి రోజున రూ.34.65 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు కావడం విశేషం.
రెండో రోజు అనగా శుక్రవారం (సెప్టెంబర్ 25) కలెక్షన్లలో కొంత తగ్గుదల కనిపించింది. ఆ రోజు రూ.14.90 కోట్లు రాబట్టగా, శనివారం (సెప్టెంబర్ 26) (మూడో రోజు) మళ్లీ ది ప్యారడైజ్ కలెక్షన్స్ పుంజుకున్నాయి.
ఒక్కరోజే 15.25 కోట్లు
ప్రముఖ బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం, శనివారం నాడు ది ప్యారడైజ్ సినిమా రూ.15.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే రెండో రోజుతో పోలిస్తే 3వ రోజున 2.3 శాతం కలెక్షన్స్ పెరిగినట్లు. దీంతో భారత బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లో 'ది ప్యారడైజ్' రూ.76.40 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.
{{/usCountry}}ప్రముఖ బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం, శనివారం నాడు ది ప్యారడైజ్ సినిమా రూ.15.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే రెండో రోజుతో పోలిస్తే 3వ రోజున 2.3 శాతం కలెక్షన్స్ పెరిగినట్లు. దీంతో భారత బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లో 'ది ప్యారడైజ్' రూ.76.40 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.
{{/usCountry}}ఇకపోతే ఇండియాలో 3 రోజుల్లో రూ. 90.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే, రెండు రోజుల్లోనే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 114 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇక 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ది ప్యారడైజ్ చిత్రానికి రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయినట్లు సమాచారం.
ది ప్యారడైజ్ ఓవర్సీస్ కలెక్షన్స్
అలాగే, ఓవర్సీస్‌లో ఒక్క 3వ రోజునే ది ప్యారడైజ్ సినిమాకు రూ. 4 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఈ లెక్కన 3 రోజుల్లో ఓవర్సీస్‌లో మొత్తంగా శ్రీకాంత్ ఓదెల సినిమాకు రూ. 29 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
బాక్సాఫీస్ వద్ద తొలి రోజుతో పోలిస్తే కలెక్షన్ల గ్రాఫ్ మారినప్పటికీ, చిత్ర యూనిట్ శనివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా ది ప్యారడైజ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ సినిమాకు వస్తున్న స్పందనపై స్పందించారు.
టాక్‌పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు
“ఈ మధ్య కాలంలో ఉదయం పూట పాజిటివ్ టాక్ వచ్చి సాయంత్రానికి మారడం చూస్తున్నాం. కానీ 'ది ప్యారడైజ్' విషయంలో దానికి భిన్నంగా జరిగింది. పీరిమియర్ షోలతో ఒక రకమైన టాక్ మొదలైనా, ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఇటీవల కాలంలో ఏ సినిమాకూ ఇలాంటి మార్పు నేను చూడలేదు” అని నాని తెలిపారు.