The Paradise OTT: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన 'ది ప్యాారడైజ్' (The Paradise) నేడు (సెప్టెంబర్ 24) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై భారీ ఓపెనింగ్స్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రీమియర్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ను మేకర్స్ ప్రకటించేశారు.
ది ప్యారడైజ్ ఓటీటీ

థియేటర్లలో 'ది ప్యారడైజ్' బిగ్ స్క్రీన్‌ను షేక్ చేస్తున్న వేళ, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌పై మేకర్స్ ఊహించిన ప్రకటన చేశారు. పాన్-ఇండియా లెవెల్లో భారీ హైప్‌తో వచ్చిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ బిగ్గీ పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల ఆడియన్స్‌ను రీచ్ అయ్యేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఎస్‌ఎల్‌వి సినిమాస్‌కి భారీ ఆఫర్ ఇచ్చి ఈ హక్కులను దక్కించుకుంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు?
నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ డీల్, రిలీజ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి రావడంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఓటీటీ రిలీజ్ ఎప్పుడన్నదే ప్రశ్న. ది ప్యారడైజ్ మూవీని నాలుగు వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ డీల్ చేసుకుందని టాక్.
నాలుగు వారాలు అంటే దసరా సందర్భంగా అక్టోబర్ 20న ది ప్యారడైజ్ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. థియేట్రికల్ రన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ఆడియన్స్ ముందుకు రానుంది.
ట్విస్ట్ ఇదే
{{/usCountry}}నాలుగు వారాలు అంటే దసరా సందర్భంగా అక్టోబర్ 20న ది ప్యారడైజ్ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. థియేట్రికల్ రన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ఆడియన్స్ ముందుకు రానుంది.
ట్విస్ట్ ఇదే
{{/usCountry}}ది ప్యారడైజ్ మూవీ ఓటీటీ రైట్స్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుందని టాక్. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మధ్య టఫ్ ఫైట్ నడిచిందని సమాచారం. చివరకు గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం అయిన నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీకి అదిరిపోయే రేట్ ఆఫర్ చేసిందని తెలిసింది.
ఆల్ టైమ్ రికార్డ్స్ గ్యారెంటీ
ది ప్యారడైజ్ మూవీ డే 1 ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అయిందని ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. నాని కెరీర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ మోత మోగాయి. గతంలో 'హిట్ 3', 'దసరా' సినిమాల పేరిట ఉన్న ఫస్ట్ డే వసూళ్ల రికార్డులను 'ది ప్యారడైైజ్' ఈజీగా దాటేస్తుందని అంటున్నారు.