Paradise Ott: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన ది ప్యారడైజ్.. నాని మాస్ యాక్షన్.. ఎందుకు మిస్ కాకూడదో తెలుసా?

Paradise Ott: ఓటీటీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేసిన రోజు రానే వచ్చింది. నాని ఫ్యాన్స్, సినీ లవర్స్ ను ఖుష్ చేస్తూ ది ప్యారడైజ్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ను ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదో ఇక్కడ చూసేయండి. 

Published on: Oct 22, 2026, 05:51:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Paradise Ott: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' (The Paradise). 'దసరా' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ భారీ యాక్షన్ డ్రామా థియేటర్లలో సెప్టెంబర్ 24న విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రిమియర్‌కు వచ్చేసింది.

ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన ది ప్యారడైజ్.. నాని మాస్ యాక్షన్.. ఎందుకు మిస్ కాకూడదో తెలుసా? (x/THE PARADISE)
ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన ది ప్యారడైజ్.. నాని మాస్ యాక్షన్.. ఎందుకు మిస్ కాకూడదో తెలుసా? (x/THE PARADISE)

ది ప్యారడైజ్ ఓటీటీ

ఓటీటీ లవర్స్ కు అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు ది ప్యారడైజ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇవాళ అక్టోబర్ 22 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఐదు భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ అసలు కథ ఏంటి, ఓటీటీలో ఎందుకు చూడాలో తెలుసుకుందాం.

కథేంటంటే?

ఈ సినిమా కథ 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. సమాజంలో ఎలాంటి గుర్తింపు, కనీస పౌరసత్వ హక్కులు లేని 'సవారీ' అనే ఒక సంచార తెగకు చెందిన ప్రజల కథ ఇది. ఆ ప్రాంతాన్ని శాసిస్తూ, ఆ ప్రజలను బానిసలుగా చూసే క్రూరమైన భూస్వామి షికంజా మాలిక్ (మోహన్ బాబు), అతని కొడుకు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయల్) ల ఆధిపత్యం నడుస్తుంటుంది.

ఈ అణచివేతపై ఆ తెగకు చెందిన సమ్మక్క (సోనాలి కులకర్ణి) అనే మహిళ మొదటిసారి గళం విప్పుతుంది. ఆమె కొడుకు జడల్ (నాని) మాలిక్ దారుణాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తాడు. తన ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం జడల్ చేసిన ఈ రక్తపాత పోరాటమే 'ది ప్యారడైజ్'.

ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదు?

• నాని మునుపెన్నడూ లేని రస్టిక్ రోల్: ఈ సినిమాలో జడల్ పాత్రలో నాని నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పూర్తి మాస్, ఊరమాస్ లుక్‌తో నాని చేసిన భీభత్సమైన యాక్షన్ సీక్వెన్సులు, ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ స్క్రీన్ పై షాక్ ఇస్తాయి.

• పవర్‌ఫుల్ విలనిజం: సీనియర్ నటుడు మోహన్ బాబు క్రూరమైన విలన్‌గా మెప్పించగా, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ తన నటనతో సర్ ప్రైజ్ చేశారు. వీరిద్దరితో నాని తలపడే సీన్లు హైలైట్‌గా నిలుస్తాయి.

• అనిరుధ్ మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం.. ముఖ్యంగా 'ఆయా షేర్' సాంగ్, ఎమోషనల్ సీన్లలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

• భారీ నిర్మాణ విలువలు: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎక్కడా రాజీ పడకుండా 1980ల నాటి మురికివాడల వాతావరణాన్ని సహజంగా చూపించడానికి రియల్ సెట్స్ వేసి ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించారు.

థియేటర్లలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ మిస్ అయిన వారు, నాని ఊరమాస్ పర్ఫార్మెన్స్ చూడాలనుకునే వారు వెంటనే నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ రోజే 'ది ప్యారడైజ్' చూసేయండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More