Nani The Paradise: హైదరాబాద్ మాస్ సినిమా అడ్డా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఫ్యాన్స్‌తో కలిసి తన కొత్త సినిమా 'ది పారడైజ్' ప్రీమియర్ షో చూడాలని నాచురల్ స్టార్ నాని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ పోలీసులకు నాని సోషల్ మీడియా వేదికగా ఓపెన్ రిక్వెస్ట్ పంపారు.
"చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగా".. నాని ఎమోషనల్ పోస్ట్

నాని చేసిన ఈ సడన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మాస్ హబ్‌లో ఫ్యాన్స్ మధ్య ప్రీమియర్ షో చూడటమంటే ఉండే ఆ కిక్కే వేరని, తమ అభిమాన హీరో రిక్వెస్ట్‌కి ప్రభుత్వం వెంటనే ఓకే చెప్పాలని నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 23న జరగబోయే 'ది పారడైజ్' ప్రీమియర్ షోకి సంబంధించిన అనుమతులు ఇవ్వాలని నాని తన పోస్ట్‌లో కోరారు. ఒక సినిమా లవర్‌గా చిన్నప్పటి నుంచి థియేటర్‌లో జనాలతో కలిసి మూవీస్ చూడటం తనకు చాలా ఇష్టమని చెప్పారు. హైదరాబాద్‌లో ఆ మాస్ వైబ్, ఆ ఎనర్జీ కేవలం ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోనే దొరుకుతుందని గుర్తు చేసుకున్నారు.
"ఒక సినిమాను ఎంతో కష్టపడి తీసిన తర్వాత, థియేటర్‌లో ఆడియన్స్ మధ్య కూర్చుని వాళ్ల రెస్పాన్స్ చూడటంలోనే ఒక మేకర్ లేదా యాక్టర్‌కి నిజమైన సంతృప్తి లభిస్తుంది. అందుకే సెప్టెంబర్ 23న క్రాస్ రోడ్స్ థియేటర్‌లో మా ఆడియన్స్‌తో కలిసి సినిమా చూడాలనుకుంటున్నాను" అని నాని చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా వివరించారు.
సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తాం.. పోలీసులకు హామీ
హైదరాబాద్‌లోనే అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్లో నాని లాంటి టాప్ స్టార్ వస్తే విపరీతమైన జనాలు, ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గతంలో కొన్ని సినిమాల ప్రీమియర్ల సమయంలో ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నాని ముందే అలర్ట్ అయ్యారు.
{{/usCountry}}హైదరాబాద్‌లోనే అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్లో నాని లాంటి టాప్ స్టార్ వస్తే విపరీతమైన జనాలు, ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గతంలో కొన్ని సినిమాల ప్రీమియర్ల సమయంలో ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నాని ముందే అలర్ట్ అయ్యారు.
{{/usCountry}}"పోలీస్ డిపార్ట్‌మెంట్ చెప్పే అన్ని రకాల ప్రొటోకాల్స్, సేఫ్టీ గైడ్‌లైన్స్ మేము ఖచ్చితంగా పాటిస్తాం. పబ్లిక్ సేఫ్టీయే మా మొదటి ప్రాధాన్యత. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించి అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాను" అని నాని తెలంగాణ పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ సెంటిమెంట్.. బాక్సాఫీస్ వేట
తెలుగు సినిమా హిస్టరీలో ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సుదర్శన్, దేవి, సంధ్య లాంటి ఐకానిక్ థియేటర్లలో సినిమా పడిందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. నాని కూడా తన కెరీర్ ఆరంభం నుంచి ఈ థియేటర్లతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' లాంటి వరుస సక్సెస్ లతో జోరు మీదున్న నాని, ఇప్పుడు 'ది పారడైజ్' చిత్రంతో సరికొత్త రికార్డులపై కన్నేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాని విజ్ఞప్తిపై స్పందించి పర్మిషన్ ఇస్తుందో లేదో చూడాలి. ఒకవేళ పర్మిషన్ వస్తే మాత్రం సెప్టెంబర్ 23న ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఫ్యాన్స్ సంబరాలు ఆపడం ఎవరి వల్ల కాదు.