The Paradise Runtime: భారీ రన్‌టైమ్‌తో వస్తున్న ది పారడైజ్.. ఏకంగా 21 మార్పులు చేర్పులతో ఫైనల్ కట్

The Paradise Runtime: నాని ది పారడైజ్ మూవీ సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 2 గంటల 54 నిమిషాలు కావడం విశేషం. అయితే అదే టైమ్ లో సెన్సార్ బోర్డు సూచనల మేరకు సినిమాలో భారీగా మార్పులు కూడా జరిగాయి.

Published on: Sep 21, 2026, 17:08:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Paradise Runtime: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ది పారడైజ్' సెన్సార్ ప్రాసెస్ గురించిన అప్‌డేట్ టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. సెన్సార్ బోర్డు (CBFC) ఈ సినిమాకి ఏకంగా 21 కట్స్ సూచిస్తూ 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్ మంజూరు చేసింది.

The Paradise Runtime: భారీ రన్‌టైమ్‌తో వస్తున్న ది పారడైజ్.. ఏకంగా 21 మార్పులు చేర్పులతో ఫైనల్ కట్
The Paradise Runtime: భారీ రన్‌టైమ్‌తో వస్తున్న ది పారడైజ్.. ఏకంగా 21 మార్పులు చేర్పులతో ఫైనల్ కట్

సీన్లకు కత్తెర.. హీరో చేతిపై ఉన్న ఆ బూతు టాటూ తొలగింపు

ది పారడైజ్ సినిమాలో చూపించిన కొన్ని విపరీతమైన వైలెన్స్ సీన్లు, తీవ్రమైన బూతు మాటలు, హీరో క్యారెక్టర్ చేతిపై ఉన్న వివాదాస్పద టాటూపై సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డు సూచనల మేరకు మేకర్స్ సదరు హింసాత్మక దృశ్యాలను ఎడిట్ చేయడంతో పాటు కొన్ని డైలాగ్స్‌ని మ్యూట్ చేసి, చట్టబద్ధమైన హెచ్చరికల కార్డ్స్ యాడ్ చేయక తప్పలేదు.

కత్తిరింపుల తర్వాత ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్‌ను 174 నిమిషాలుగా (2 గంటల 54 నిమిషాలు) లాక్ చేశారు. ప్రారంభంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్ ప్లాన్ చేసినప్పటికీ, సెన్సార్ సూచించిన ఎడిటింగ్ మార్పుల వల్ల నిడివి కాస్త పెరిగినట్లు తెలుస్తోంది.

నాని ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో హాట్ డిబేట్

సెన్సార్ బోర్డు ఈ సినిమాపై ఇన్ని కట్స్ విధించడం పట్ల నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'దసరా' లాంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడం వల్ల ఈ రా యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఒక అణచివేతకు గురైన సమాజం హక్కుల కోసం తిరుగుబాట పట్టే కథాంశంతో ఈ పీరియాడిక్ మాస్ డ్రామా రూపుదిద్దుకుంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

8 భాషల్లో భారీ రిలీజ్.. ఎలాంటి ట్రైలర్ లేకుండానే రికార్డు హైప్

నాని తన 18 ఏళ్ల యాక్టింగ్ కెరీర్‌లోనే అత్యంత కష్టపడి చేసిన ల్యాండ్‌మార్క్ మూవీగా 'ది పారడైజ్' నిలవనుంది. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం సహా దాదాపు 8 భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.

సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ట్రైలర్ రిలీజ్ చేయకుండానే కేవలం టీజర్, సాంగ్స్‌తోనే బిజినెస్ క్లోజ్ చేయడం, బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేయడం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More