హైదరాబాద్‌లోని లులు మాల్‌లో జరిగిన ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలుసు కదా. సెల్ఫీల కోసం జనం ఆమెను చుట్టుముట్టి, తోసేశారు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించినందుకు మాల్ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్స్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసు కేసు

బుధవారం (డిసెంబర్ 17) సాయంత్రం హైదరాబాద్‌లోని లులు మాల్‌లో ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' నుంచి 'సహానా సహానా' సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆమెను జనం తోసేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు.
ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు స్పందించారు. గురువారం (డిసెంబర్ 18)నాడు లులు మాల్ మేనేజ్‌మెంట్, ఈవెంట్ ఆర్గనైజర్స్‌పై కేసు నమోదు చేశారు. ఇంత పెద్ద ఈవెంట్‌ను, అదీ ఒక సెలబ్రిటీని పిలిచి నిర్వహిస్తున్నప్పుడు పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడం, జనాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది?
మామూలుగానే తెలుగు సినిమా ఈవెంట్స్ అంటే ఆలస్యం అవుతుంటాయి. సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన ఈవెంట్ లేట్‌గా మొదలైంది. అప్పటికే మాల్‌లో జనం కిక్కిరిసిపోయారు. నిధి అగర్వాల్ కనిపించగానే జనం ఎగబడ్డారు. సెల్ఫీల కోసం ఆమెను చుట్టుముట్టారు. కొందరు ఆమెను తాకడానికి ప్రయత్నించారు.
వైరల్ అవుతున్న వీడియోల్లో నిధి చాలా ఇబ్బందిగా, భయంగా కనిపించింది. ఆమె సెక్యూరిటీ, టీమ్ మెంబర్స్ అతి కష్టం మీద జనాన్ని పక్కకు నెట్టుకుంటూ ఆమెను కారు దగ్గరకు చేర్చారు.
{{/usCountry}}వైరల్ అవుతున్న వీడియోల్లో నిధి చాలా ఇబ్బందిగా, భయంగా కనిపించింది. ఆమె సెక్యూరిటీ, టీమ్ మెంబర్స్ అతి కష్టం మీద జనాన్ని పక్కకు నెట్టుకుంటూ ఆమెను కారు దగ్గరకు చేర్చారు.
{{/usCountry}}ఈ ఈవెంట్‌లో ప్రభాస్, మరో హీరోయిన్ రిద్ధి కుమార్, డైరెక్టర్ మారుతి, నిర్మాత విశ్వ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా పాల్గొన్నారు. ఈ ఘటనపై నిధి అగర్వాల్ ఇంకా స్పందించలేదు.