...
...
Next Story

తెలుగు హీరోయిన్లకు డైలాగులు చెప్పడం రాదు.. కెరీర్ మొత్తం ఏబీసీడీలతోనే గడిపేశారు: రాజా సాబ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

తెలుగు, తమిళ హీరోయిన్లపై ది రాజా సాబ్ హీరోయిన్ మాళవికా మోహనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. వాళ్లకు అసలు డైలాగులు చెప్పడం రాదని, ఏబీసీడీ అంటూ కెరీర్ మొత్తం గడిపేశారని అనడం గమనార్హం.

Published on: Jan 21, 2026, 20:05:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మాళవికా మోహనన్.. ఈ మధ్యే ది రాజా సాబ్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ. ఒకప్పుడు ఓ తమిళ సినిమాలో ఆమె ఎమోషన్స్ సరిగా చూపించలేక ట్రోలింగ్ కు గురైంది. అలాంటి నటి ఇప్పుడు తెలుగు, తమిళ హీరోయిన్లకు అసలు డైలాగులు చెప్పడం రాదంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వన్, టు, త్రీ లేదంటే ఏబీసీడీ

తెలుగు హీరోయిన్లకు డైలాగులు చెప్పడం రాదు.. కెరీర్ మొత్తం ఏబీసీడీలతోనే గడిపేశారు: రాజా సాబ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
తెలుగు హీరోయిన్లకు డైలాగులు చెప్పడం రాదు.. కెరీర్ మొత్తం ఏబీసీడీలతోనే గడిపేశారు: రాజా సాబ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ది రాజా సాబ్ హీరోయిన్ మాళవికా మోహనన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పాయీ, ఇషాన్ ఖట్టర్ కూడా ఉన్నారు. వాళ్లతో మాట్లాడుతూ తెలుగు, తమిళ హీరోయిన్లకు డైలాగులు చెప్పడం రాదని మాళవిక చెప్పింది.

“తెలుగు, తమిళంలలో చాలా కాలంగా కొంతమంది హీరోయిన్లు అసలు డైలాగులను చూడనే చూడరు. ఓ సీన్ లో బాధగా కనిపించాలంటే ముఖం బాధగా పెట్టి 1, 2, 3, 4.. 1, 2, 3,4 అనేవాళ్లు. అంతే.. ఎందుకంటే ఏదో సమయంలో డైలాగులు లిప్ మూమెంట్ కు సరిపోయేవి. కొన్నిసార్లు ఏబీసీడీ, ఏబీసీడీ అనేవాళ్లు. ఇదేదో ఎప్పుడో ఒకసారి చేసింది కాదు. కెరీర్ మొత్తం ఇలాగే చేశారు” అని మాళవిక చెప్పడంతో మనోజ్, ఇషాన్ గట్టిగా నవ్వారు.

మాళవికా మోహనన్ గురించి..

మాళవికా మోహనన్ ఓ మలయాళ నటి. ఈమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కూతురు. ఆమె తన మాతృభాష మలయాళంతోపాటు తమిళం, హిందీ, తాజాగా తెలుగులోనూ నటించింది. ది రాజా సాబ్ సినిమాలో భైరవి పాత్రలో కనిపించింది. త్వరలోనే తమిళ మూవీ సర్దార్ 2తో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది మోహన్ లాల్ తో కలిసి హృదయపూర్వం మూవీతో హిట్ అందుకుంది. అంతకుముందు విక్రమ్ తో కలిసి తంగలాన్ సినిమాలోనూ నటించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe