ఈ ఏడాది సంక్రాంతి రేసులో వచ్చిన తొలి సినిమా ది రాజా సాబ్. భారీ అంచనాల మధ్య శుక్రవారం (జనవరి 9) రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలే వచ్చాయి. అభిమానులు తప్ప న్యూట్రల్ ప్రేక్షకులు, క్రిటిక్స్ చాలా వరకు నెగటివ్ రివ్యూలే ఇచ్చారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో ఉన్న ఇతర సినిమాలకు ఇది వరంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల కిందట వచ్చిన హనుమాన్, గతేడాది సంక్రాంతికి వస్తున్నాంలాగే ఈసారి కూడా సర్‌ప్రైజ్ హిట్ ఉంటుందన్న అంచనాలు పెరిగాయి.
చిరంజీవికి కలిసి వస్తుందా?

ప్రభాస్ 'ది రాజా సాబ్' రివ్యూలు నేరుగా చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. పండగకి ఒక పెద్ద సినిమా చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్, మొదటి ఆప్షన్ నిరాశపరచడంతో, ఆటోమేటిక్‌గా రెండో పెద్ద సినిమా అయిన చిరంజీవి సినిమా వైపు చూస్తారు.
ఇప్పటికే చిరంజీవి సినిమాకి టికెట్ రేట్లు పెంచలేదని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు 'రాజా సాబ్' పై నెగటివ్ టాక్ రావడంతో, తక్కువ రేట్లకు అందుబాటులో ఉన్న చిరు సినిమాకే సామాన్య ప్రేక్షకులు ఓటేసే అవకాశం ఉంది.
పైగా అనిల్ రావిపూడి-చిరు కాంబినేషన్ కాబట్టి వినోదానికి లోటు ఉండదని, ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ సినిమాను ఎంచుకునే ఛాన్స్ ఉంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే.
చిన్న సినిమాలకూ గోల్డెన్ ఛాన్స్
ఇక ది రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడితే.. అది సంక్రాంతి బరిలో ఉన్న చిన్న సినిమాలు అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి లాంటి సినిమాలకు లబ్ధి చేకూరనుంది.
జాతిరత్నాలు తర్వాత నవీన్ చేస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ అనగనగా ఒక రాజు. పెద్ద సినిమాల్లో సీరియస్ నెస్, లేదా నిరాశ ఎదురైతే.. జనం నవ్వుకోవడానికి ఈ సినిమాకే క్యూ కడతారు. పండగ రోజుల్లో కామెడీ ఎప్పుడూ కింగ్. అటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ కూడా ఇదే ఆశతో ఉంది. రాజా సాబ్ స్క్రీన్స్ తగ్గుముఖం పడితే, ఆ థియేటర్లు ఈ చిన్న సినిమాలకు దొరుకుతాయి.
రెండేళ్లుగా ఇలాగే..
{{/usCountry}}జాతిరత్నాలు తర్వాత నవీన్ చేస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ అనగనగా ఒక రాజు. పెద్ద సినిమాల్లో సీరియస్ నెస్, లేదా నిరాశ ఎదురైతే.. జనం నవ్వుకోవడానికి ఈ సినిమాకే క్యూ కడతారు. పండగ రోజుల్లో కామెడీ ఎప్పుడూ కింగ్. అటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ కూడా ఇదే ఆశతో ఉంది. రాజా సాబ్ స్క్రీన్స్ తగ్గుముఖం పడితే, ఆ థియేటర్లు ఈ చిన్న సినిమాలకు దొరుకుతాయి.
రెండేళ్లుగా ఇలాగే..
{{/usCountry}}రెండేళ్లుగా సంక్రాంతికి సర్‌ప్రైజ్ హిట్ వస్తోంది. 2024లో హనుమాన్, 2025లో సంక్రాంతికి వస్తున్నాం ఇలాగే బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు కూడా 'రాజా సాబ్' వెనకబడితే.. నవీన్ పోలిశెట్టి సినిమా గానీ, చిరంజీవి సినిమా గానీ ఆ 'సర్ప్రైజ్ విన్నర్' స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా 'అనగనగా ఒక రాజు' ఈసారి 'హనుమాన్' లాంటి మ్యాజిక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా జనవరి 13న రాబోతోంది. నిజానికి ఈ సినిమాలన్నింటికీ రాజా సాబ్ ఏం చేస్తాడో అన్న ఆందోళన కలిగే ఉంటుంది. కానీ ఈ సినిమా రివ్యూలు వాళ్లకు ఓ వరంలా మారబోతున్నాయన్నది మాత్రం నిజం. మరి ఆ అవకాశాన్ని ఏ మూవీ అందిపుచ్చుకుంటుందో చూడాలి.