ది రాజా సాబ్ సందడి రిలీజ్ కు రెండు వారాల ముందే మొదలు కానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ ను మాత్రం ఈ శనివారమే (డిసెంబర్ 27) నిర్వహిస్తుండటం విశేషం. అలాగే మూవీ నుంచి మాళవిక మోహనన్ పాత్ర భైరవి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆశ్చర్యకరంగా రెండు వారాల ముందే నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది.
వేదిక వివరాలను తర్వాత అనౌన్స్ చేస్తామని మేకర్స్ చెప్పారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం.. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి అనే క్యాప్షన్ తో మేకర్స్ ఓ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈవెంట్ ను జాగ్రత్తగా నిర్వహించండి.. ఏదైనా జరిగితే మా డార్లింగ్ కు చెడ్డ పేరు వస్తుందంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.
భైరవి లుక్ రిలీజ్
ఇక ది రాజా సాబ్ మూవీలో నటిస్తున్న మాళవిక మోహనన్ పాత్ర భైరవి లుక్ కూడా రిలీజ్ చేశారు. నల్ల చీరలో ఆమె కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని సెక్సీగా కనిపించింది. భైరవి.. పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్ అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ది రాజా సాబ్ మూవీ గురించి..
ది రాజా సాబ్ మూవీ జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా క్రిస్మస్ రోజు కూడా మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రాజే యువరాజే అనే సాంగ్ ప్రోమోను తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ మరో సర్ప్రైజ్ ఇచ్చారు.
{{/usCountry}}ది రాజా సాబ్ మూవీ జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా క్రిస్మస్ రోజు కూడా మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రాజే యువరాజే అనే సాంగ్ ప్రోమోను తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ మరో సర్ప్రైజ్ ఇచ్చారు.
{{/usCountry}}మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీగా ఈ ది రాజా సాబ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సంక్రాంతికి రానున్న తొలి సినిమా ఇదే కాగా.. మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారీలాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి.