The Red Bag: మొన్న గన్స్, ఇప్పుడు హాకీ స్టిక్స్- ముగ్గురు అమ్మాయిల ది రెడ్ బ్యాగ్ కథ- భారీ స్థాయిలో రిలీజ్- ఇదే డేట్!
The Red Bag Release Date Announced PVR Inox: హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. పీవీఆర్ ఐనాక్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ది రెడ్ బ్యాగ్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
The Red Bag Release Date Announced PVR Inox: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలతో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అదే బాటలో సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ‘ది రెడ్ బ్యాగ్’ మూవీ.

యూట్యూబ్‌లో ది రెడ్ బ్యాగ్ పాటలకు మంచి వ్యూస్
మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ది రెడ్ బ్యాగ్ చిత్రానికి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ది రెడ్ బ్యాగ్ గ్లింప్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ మోపురి అందించిన పాటలు యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఆగస్ట్ 21న థియేటర్లలోకి గ్రాండ్ ఎంట్రీ
ప్రమోషన్లలో వేగం పెంచిన చిత్రబృందం తాజాగా ది రెడ్ బ్యాగ్ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 21న ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థకు థియేట్రికల్ హక్కులు
సినీ పంపిణీ రంగంలో ఎన్నో భారీ విజయవంతమైన చిత్రాలను విడుదల చేసిన ప్రముఖ సంస్థ 'పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్' (PVR INOX Pictures) ది రెడ్ బ్యాగ్ సినిమా నైజాం, ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పోస్టర్‌తో పెరిగిన ఉత్కంఠ..
విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ది రెడ్ బ్యాగ్ సినిమా నుంచి ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను బయటకు వదిలారు. అందులో ముగ్గురు యువతులు చేతిలో హాకీ స్టిక్స్ పట్టుకుని డిఫరెంట్ యాంగిల్స్‌లో పోజులు ఇచ్చారు. ఇదివరకు విడుదల చేసిన పోస్టర్‌లో అదే ముగ్గురు యువతులు చేతిలో గన్స్ పట్టుకుని కనిపించి అట్రాక్ట్ చేశారు.
క్యూరియాసిటీ పెంచుతున్న కథ!
వారి చేతిలో తుపాకులతోపాటు, వద్ద ఉన్న ఒక రహస్యమైన 'రెడ్ బ్యాగ్', సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ సీన్లు ఈ పోస్టర్‌లో కనిపించి సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఇలా డిఫరెంట్ పోస్టర్స్ ద్వారా ది రెడ్ బ్యాగ్ కథపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్.
రెడ్ బ్యాగ్ చుట్టూ రహస్యాలు, మలుపులు
ఈ రెడ్ బ్యాగ్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? దాని చుట్టూ తిరిగే కథనంలో ఉండే మలుపులు ఎలాంటివి? అనే విషయాలను మేకర్స్ చాలా రహస్యంగా ఉంచారు. థియేటర్లో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించడానికే కథను సస్పెన్స్‌గా ఉంచినట్లు దర్శకనిర్మాతలు తెలిపారు.
ది రెడ్ బ్యాగ్ నటీనటులు
ఇకపోతే ది రెడ్ బ్యాగ్ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ప్రియేష్ గురుస్వామి అందించిన ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ) చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
త్వరలో ది రెడ్ బ్యాగ్ ట్రైలర్
అలాగే, శివ శర్వాణి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. విక్రమ్ రాజా ది రెడ్ బ్యాగ్ చిత్రానికి కథను అందించారు. రాబోయే రోజుల్లో ది రెడ్ బ్యాగ్ ట్రైలర్, మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో థియేట్రికల్ బజ్ మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


