OTT Release: ఓటీటీలోకి నిన్న రిలీజైన తెల్లకాగితం, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. డిఫరెంట్ జోనర్లు.. ఎక్కడ చూడాలంటే?

OTT Release: అక్టోబర్ 2న గాంధీ జయంతి హాలీడే కావడంతో థియేటర్లలో కొత్త సినిమాల రిలీజ్ ల సందడి నెలకొంది. ఈ శుక్రవారం ఫహాద్ ఫాజిల్ హీరోగా తెలుగు సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, టీనేజీ లవ్ స్టోరీ ‘తెల్లకాగితం’ కూడా థియేటర్లకు వచ్చాయి. మరి ఈ సినిమాల ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Oct 3, 2026, 16:22:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Release: టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలతో తెరకెక్కిన రెండు క్రేజీ చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఒకటి మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ నేరుగా తెలుగులో నటించిన ఫాంటసీ డ్రామా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. మరొకటి యంగ్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఎమోషనల్ టీనేజ్ లవ్ స్టోరీ ‘తెల్లకాగితం’. ఈ రెండు చిత్రాల డిజిటల్ రైట్స్, కంటెంట్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీలోకి నిన్న రిలీజైన తెల్ల కాగితం, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. డిఫరెంట్ జోనర్లు.. ఎక్కడ చూడాలంటే? (x)
ఓటీటీలోకి నిన్న రిలీజైన తెల్ల కాగితం, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. డిఫరెంట్ జోనర్లు.. ఎక్కడ చూడాలంటే? (x)

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై ఎస్.ఎస్. కార్తికేయ, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రాన్ని నిర్మించారు. శశాంక్ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ & డీల్

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్ రన్ ముగిసిన 4 నుంచి 6 వారాల తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

సినిమా స్టోరీ

హైదరాబాద్‌ నేపథ్యంలో సాగే స్ట్రీట్ మెజీషియన్ సూరి (ఫహాద్ ఫాజిల్) కథ ఇది. అనుకోకుండా అతని చేతికి ఒక మంత్రశక్తి గల చిన్నారి జిన్నీ (దివ్య) దొరుకుతుంది. ఆ జిన్నీని సూరి పొరపాటున మాయం చేయడంతో నగరంలో ఎలాంటి వింత పరిణామాలు చోటుచేసుకున్నాయి, ఆ తర్వాత అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి అనే ఫాంటసీ కామెడీ లైన్‌తో సినిమా సాగుతుంది.

తెల్ల కాగితం

'కోర్ట్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హర్ష్ రోషన్ కథానాయకుడిగా వచ్చిన మూవీ తెల్లకాగితం. నక్షత్ర హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.

ఈటీవీ విన్ లో

'తెల్లకాగితం' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు టాక్. నాలుగు వారాల థియేట్రికల్ విండో తర్వాత ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అంటే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, తెల్లకాగితం సినిమాలు అక్టోబర్ 30న స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ దసరా కానుకగా 20వ తేదీనే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

టీనేజ్ లవ్

భీమవరం పరిసర ప్రాంతాల్లోని ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగే అమాయకపు టీనేజ్ లవ్ స్టోరీ తెల్లకాగితం మూవీ. స్కూల్ రోజుల్లోనే రాము (హర్ష్ రోషన్), ఆశ (నక్షత్ర) ప్రేమలో పడతారు. అయితే, వయసు తెచ్చిన తొందరపాటు, రాంగ్ గైడెన్స్ వల్ల వారిద్దరూ శారీరకంగా దగ్గరవుతారు. ఆ తర్వాత ఆ అమ్మాయి గర్భం దాల్చిందనే అనుమానంతో వారి జీవితాలు ఒక్కసారిగా మలుపు తిరుగుతాయి. ఆ సమస్యను ఇంట్లో చెప్పలేక ఆ టీనేజ్ జంట పడిన వేదన, చివరికి ఆ సమస్య నుండి ఎలా బయటపడ్డారు అనే సందేశాత్మకమైన డ్రామాతో ఈ చిత్రం రూపొందింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More