...
...
Next Story

OTT Thrillers: ఈ వారం ఒకే ఓటీటీలో మిస్ అవకుండా చూడాల్సిన రెండు తెలుగు వెబ్ సిరీస్ లు.. మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్లు

OTT Thrillers: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెండు క్రేజీ తెలుగు థ్రిల్లర్ సిరీస్‌లు డిజిటల్ వేదికపైకి వస్తున్నాయి. ఇందులో ఒకటి బ్లాక్ బస్టర్ మిస్టరీ థ్రిల్లర్ కు రెండో పార్ట్ కాగా.. మరొకటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Sep 7, 2026, 13:51:24 IST
Advertisement

OTT Thrillers: సస్పెన్స్, క్రైమ్, డ్రామా కథాంశాలను ఇష్టపడే ఓటీటీ ప్రేమికులకు ఈ వారం డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. మైండ్ బ్లోయింగ్ మిస్టరీ, ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన రెండు క్రేజీ తెలుగు వెబ్ సిరీస్‌లు పాపులర్ ఓటీటీ సంస్థ 'జీ5' (ZEE5) వేదికగా డిజిటల్ ప్రసారానికి సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ రెండవ వారంలో సస్పెన్స్ లవర్స్‌ను అలరించబోతున్న ఆ టాప్ 2 సిరీస్‌లు, వాటి కథాంశాల విశేషాలు ఇవే!

వీరభద్రుని రహస్యం (సీజన్ 1, పార్ట్ 2)

ఈ వారం ఒకే ఓటీటీలో మిస్ అవకుండా చూడాల్సిన రెండు తెలుగు వెబ్ సిరీస్ లు.. మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్లు
ఈ వారం ఒకే ఓటీటీలో మిస్ అవకుండా చూడాల్సిన రెండు తెలుగు వెబ్ సిరీస్ లు.. మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్లు

90ల నాటి క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్ 'మర్మదేశం' స్ఫూర్తితో తెరకెక్కిన 'వీరభద్రుని రహస్యం' మొదటి భాగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మిస్టరీలోని అసలు నిజాలను వెలికితీసేందుకు 'సీజన్ 1, పార్ట్ 2' సెప్టెంబర్ 9 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

స్టోరీ ఏంటంటే?

వీరభద్రాపురం అనే గ్రామంలోని ఆలయం దగ్గర వరుసగా జరిగే వింత మరణాలను ఊరి జనం 'వీరభద్ర స్వామి' దైవాగ్రహంగా నమ్ముతుంటారు. అయితే నగరానికి చెందిన డాక్టర్ వెన్నెల (యాక్టర్ ఆనీ) ఈ మూఢనమ్మకాన్ని ప్రశ్నిస్తుంది. దైవకార్యంగా ప్రచారంలో ఉన్న ఆ మరణాల వెనుక మానవ కుట్ర ఉందనే అనుమానంతో ఆమె సొంతంగా విచారణ ప్రారంభిస్తుంది.

స్థానిక పోలీసుల నిర్లక్ష్యం, ఊరి పెద్ద యోగానందం (రఘు కుంచె) నుంచి ఎదురయ్యే బెదిరింపులను అధిగమించి వెన్నెల నిజాలను ఎలా బయటకు తీసిందనేది పార్ట్ 2లో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించనున్నారు. భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఆనీ, రఘు కుంచె, రఘు, అభినవ్, కమల్ తుము కీలక పాత్రలు పోషించారు.

పంచనామా

పోలీస్ ఇన్ స్పెక్టర్ జై రామ్ (ప్రేమిస్తే భరత్) తమ్ముడు అనుమానాస్పద రీతిలో మరణిస్తాడు. దీని వెనుక ఉణ్న నిజానిజాలను తెలుసుకునేందుకు జై విచారణ ప్రారంభిస్తాడు. ఈ పరిశోధనలో ఆయనకు సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు నడుపుతున్న ఒక ప్రమాదకరమైన మెడికల్ సిండికేట్ గురించిన షాకింగ్ విషయాలు తెలుస్తాయి.

తన సోదరుడి హత్య వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్‌ను పట్టుకోవడానికి జై చేసే పోరాటం, ఆయనకు ఎదురయ్యే ప్రాణసంకటమైన పరిస్థితులే ఈ సిరీస్ ప్రధాన కథాంశం. ఈ సినిమాలో భారత్ శ్రీనివాసన్, శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూపా లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks